Dec 2nd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases, Petitions And Political Updates 2 December | Sakshi
Sakshi News home page

Dec 2nd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Dec 2 2023 6:54 AM | Last Updated on Sat, Dec 2 2023 5:25 PM

TDP Chandrababu Cases, Petitions And Political Updates 2 December - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

3:25 PM, Dec 2, 2023
మాట మీద నిలబడలేదు.. సారీ : పవన్‌ కళ్యాణ్‌

 • పార్టీ పెట్టినప్పుడు మాటమీద నిలబడలేదు
 • దాని వల్ల అవమానాలు ఎదుర్కొన్నాం 
 • వ్యవస్థాపక సభ్యుడిగా ఆ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్తున్నా
 • తెలుగు ప్రజల ఐక్యతకు కట్టుబడి ఉన్నాను
 • 2014 ఎన్నికల్లో రాష్ట్ర క్షేమం కోసమే పోటీ చేయలేదు
 • నా దృష్టిలో పడాలని బ్యానర్లు కట్టిన వ్యక్తి 2014లో మంత్రి అయ్యారు
 • అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల బాగోగులను పట్టించుకోలేదు
 • నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన కోసం పని చేస్తా, జెండా ఎగురవేస్తా
 • నా ప్రాణం పోతే భావితరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాలి : పవన్ కళ్యాణ్‌

2:27 PM, Dec 2, 2023
ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు

 • తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్‌ మొదలుపెట్టిన తెలుగుదేశం
 • ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం
 • ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం
 • మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్‌ చేసుకోవాలా?
 • నిజాంపేట విజ్ఞాన్‌ స్కూల్‌లో ఏకంగా కౌంటర్‌ ప్రారంభించిన తెలుగుదేశం
 • దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్‌ కౌంటర్లు
 • జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు
 • తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం
 • తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర
 • ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం
 • ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర
   

1:07 PM, Dec 2, 2023
దోచుకోవడానికే పొత్తు : తోపుదుర్తి

 • అనంతపురం : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
 • ఈనెల 4న రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేసేందుకు బస్సు యాత్ర
 • దేశంలో ఏ సీఎం ఆచరణలో చేయలేని పనులను సీఎం జగన్ చేశారు
 • సీఎం జగన్ రాష్ట్రంలో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఇచ్చారు
 • టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది
 • అధికారం కోసమే టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు
 • జగన్ ప్రజల ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు
 • పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టే విధంగా చంద్రబాబు విధానాలు ఉన్నాయి
 • చంద్రబాబుకు దేశ, విదేశీ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి
   

1:07 PM, Dec 2, 2023
సమయం లేదు.. నేను వస్తే తప్ప పార్టీ బాగుపడదు

 • జైలుకెళ్లిన తర్వాత చంద్రబాబుకు జ్ఞానోదయం
 • రిపేర్‌ చేయలేనంత దారుణంగా పార్టీ దెబ్బతిందని అర్థం చేసుకున్న చంద్రబాబు
 • కొడుకు మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావడంతో చంద్రబాబులో ఆవేదన
 • తాను జైలుకెళ్తే పార్టీని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడని సీనియర్లపై ఇటీవల ఆగ్రహం
 • తానే పార్టీని మళ్లీ పట్టాలెక్కిస్తానని చెబుతోన్న చంద్రబాబు
 • వారం రోజుల్లో పార్టీ కార్యకలాపాలో నిమగ్నం కానున్న చంద్రబాబు
 • ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు
 • ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ ల సంఘం నిర్వహించే సమావేశాల్లో పాల్గొనున్న చంద్రబాబు
 • ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప సమావేశాలకు చంద్రబాబు
 • రాష్ట్రంలో ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవాలని చంద్రబాబు నిర్ణయం
 • పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేలని చంద్రబాబు యోచన
 • తమకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్న చంద్రబాబు
 • ఈ నెల 6 నుంచి 8వ  తేదీ లోపు సమయం ఇవ్వాలని లేఖ రాయనున్న చంద్రబాబు

12:42 PM, Dec 2, 2023
కాపులెవరూ హర్షించరు : ఆమంచి

 • వైఎస్ఆర్ సీపీ అంటే దివంగత వైఎస్ఆర్ పాలనకు కొనసాగింపు
 • జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది
 • పవన్ టీడీపీకి మద్దతివ్వడాన్ని కాపు సామాజికవర్గం హర్షించదు
 • ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శిస్తే సరిచేసుకుంటాం
 • టీడీపీకి మేలు చేసేందుకే పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు
 • పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు : ఆమంచి కృష్ణమోహన్‌

12:30 PM, Dec 2, 2023
దండుపాళ్యం బ్యాచ్‌ చంద్రబాబుదే : టీజేఆర్‌

 • దొంగలకు దోచిపెట్టిన దండుపాళ్యం ముఠా చంద్రబాబుదే: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
 • రుణాలు మాఫీ చేస్తానని రైతులకు ద్రోహం చేసింది చంద్రబాబే
 • వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
 • సీఎం జగన్ రైతులకు అన్ని విధాలు అండగా ఉంటున్నారు
 • ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ అసత్యాలు మాట్లాడుతున్నారు

12:02 PM, Dec 2, 2023
చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు

 • విజయవాడ: ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, భువనేశ్వరి
 • కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
 • సాయంత్రం విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు దంపతులు
 • రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు
 • ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు
 • అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయాలకు చంద్రబాబు
 • ఆధ్యాత్మిక యాత్రల అనంతరం భవిష్యత్ కార్యాచరణ : చంద్రబాబు
 • ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు

11:32 AM, Dec 2, 2023
పవన్‌కు పార్టీ కార్యకర్తలపైనే ఎందుకు కోపం? : YSRCP

 • జనసేన పొత్తులకు.. పవన్‌ కల్యాణ్ మాటలకు అర్ధాలే వేరులే..!!!
 • రాజకీయ ప్రయోజనాలే కానీ.. రాజకీయ సిద్దాంతాల్లేవా?
 • ఏపీలో టీడీపీతో.. తెలంగాణలో బీజేపీతో..ఏ రోటికాడ ఆ పాట
 • పవన్‌ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. పార్టీ కార్యకర్తలెవరూ విమర్శలు చేయకూడదట...!!
 • పైగా తన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటాడట..!!!
 • చెప్పేవాడు పవన్‌కళ్యాణ్‌ అయితే.. వినేవాడు..?
 • టీడీపీ వెనుక జనసేన వెళ్లడం లేదట..!!! టీడీపీ కలిసి వెళ్తుందట..!!!
 • రెండింటికీ తేడా ఏంటో.. పవన్ కల్యాణ్  చెబితే బాగుండేది.
 • ఆయన్ను మోదీ..అమిత్ షా..చంద్రబాబు అర్ధం చేసుకున్నారట..!!
 • కానీ.. జనసైనికులే అర్ధం చేసుకోలేదట..!!
 • ఇంతకంటే జనసైనికులకు .. అవమానం ఉంటుందా..?
 • జనసేన పుట్టినప్పటి నుంచి..జెండా పట్టింది, ఫ్లెక్సీ కట్టింది.. రోడ్డెక్కి డబ్బులు ఖర్చు పెట్టింది జనసైనికులు.
 • జనసేన జెండా పట్టని.. మోదీ, అమిత్ షా, చంద్రబాబులు.. తనను అర్థం చేసుకున్నారని చెప్పడం..
 • జనసైనికులు అర్థం చేసుకోలేదని.. పవన్‌ చెప్పడంలో అంతర్యమేంటీ?
 • తనను విమర్శించేవారిని.. కోవర్టులుగా పరిగణిస్తామనడం దేనికి సంకేతం?
 • అసలు జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్ట్ పవన్ కల్యాణ్‌ కాదా?
 • రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు..
 • నన్ను గెలిపించేలేని వారు.. ఆ ప్రశ్న అడగకూడదని పవన్ అనడం..
 • ఎమ్మెల్యేగా గెలిపించలేరు కాబట్టి.. ఎప్పటికీ సీఎం కాలేనని చెప్పడం చాతకానితనం కాదా?
 • ఇప్పుడు పవన్ కల్యాణ్‌ గురించి ఆలోచించి.. నడవాల్సింది కాపులే...
 • పవన్ వెంట నడిచే కాపులకు ఎప్పటికైనా వెన్నుపోటు తప్పదు

11:16 AM, Dec 2, 2023
వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..!

 • చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు
 • ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
 • ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
 • కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్
 • విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్  ధర్మాసనం
 • ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన
 • "మనోళ్లు బ్రీఫ్డ్‌ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
 • ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు
 • "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌" గురించి చెప్పని చంద్రబాబు
 • "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్‌ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్‌
 • ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌
 • బాలకృష్ణ చేసిన "అన్‌స్టాపబుల్‌ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు
 • అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా?

08:54 AM, Dec 2, 2023
ఆ సలహా ఇచ్చింది ఎవర్రా?

 • తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్‌ అంశం
 • లోకేష్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ
 • 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి?
 • పవన్‌ కళ్యాణ్‌కు జై కొట్టమని లోకేష్‌కు సలహా ఇచ్చింది ఎవరు?
 • తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్‌కు అర్థమవుతోందా?
 • తన కెరియర్‌తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా?
 • ఇప్పుడు కాపుల కోసం పవన్‌కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం?
 • అసలు పవన్‌కళ్యాణ్‌కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్‌కు ఏం లాభం?
 • పైగా పవన్‌ను దూరం చేసే ప్లాన్‌ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు?

08:30 AM, Dec 2, 2023
కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు

 • ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ
 • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి
 • 60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి
 • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య
 • కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన

07:04 AM, Dec 2, 2023
నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు

మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు

టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
►అమరావతిలో  భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను  చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు

ఆనాటి స్పీకర్‌ కోడెల చౌదరి
చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ...
►"ఇది విపక్షాలు చేయించిన పనే అని  సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్‌గా ఉండికూడా  చూపలేదు.
►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు?
►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా?

కాపు ఉద్యమ సమయంలో  తునిలో  రత్నాచల్‌ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టారు
►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్‌ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.?
►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్‌లు చేశారు?
►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?

చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం
►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు.
►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంట‌నే విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టాడు. ఇది `బ‌లిజ‌ల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హ‌త్య చేయించారు` అని ఆరోపణలు చేశారు.
సీన్‌ క‌ట్ చేస్తే ..
►మేయ‌ర్ దంప‌తుల‌ హ‌త్య ఆస్థి త‌గాదాల కోసం జ‌రిగింద‌ని, అది చేసింది మేయ‌ర్ మేన‌ల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే..
►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే
►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం  బాబుకు వెన్నతో పెట్టిన విద్యే

ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి.
►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది
►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు
►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు
►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.!

06:56 AM, Dec 2, 2023
జనసేన పొత్తులకు అర్థాలు వేరులే

 • ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో
 • జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్‌ ప్రకటన
 • ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది
 • నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను
 • దీని వెనుక వ్యూహాలు ఉంటాయి
 • టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు
 • టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది
 • ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు
 • నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు
 • నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు
 • కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు
 • ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు
 • టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం
 • వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం
 • కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు
 • రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.!
 • నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు
 • నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది
 • కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.!

06:48 AM, Dec 2, 2023
ఫైబర్‌గ్రిడ్‌ కేసు జనవరి 5కి వాయిదా

 • ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ
 • తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
 • ‘ఫైబర్‌గ్రిడ్‌’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు
 • టెరాసాఫ్ట్‌ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్‌ సన్నిహితులు
 • కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు
 • రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
 • కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
 • వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ LLP అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీ సృష్టి
 • ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
 • నెటాప్స్‌ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
 • నెటాప్స్‌ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించారు.
 • నెటాప్స్‌ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
 • వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్‌ కంపెనీ బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
 • టెరాసాఫ్ట్‌ లావాదేవీలను ఆడిటింగ్‌ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్‌
 • ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement