టీడీపీ శ్రేణులు పెట్రో బాంబులు, కర్రలు తీసుకుని..: మల్లాది విష్ణు | TDP cadres carried petrol bombs and sticks Malladi Vishnu | Sakshi
Sakshi News home page

టీడీపీ శ్రేణులు పెట్రో బాంబులు, కర్రలు తీసుకుని..: మల్లాది విష్ణు

Nov 15 2026 6:47 PM | Updated on Nov 15 2026 6:56 PM

TDP cadres carried petrol bombs and sticks Malladi Vishnu

విజయవాడ: టీడీపీ అరాచకాలపై ఎస్‌ఈసీకి ఆధారాలు ఇచ్చామని, పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. టీడీపీ మంత్రులు, పోలీసుల సహకారంతో నామినేషన్లను అడ్డుకొంటున్నారని మండిపడ్డారు.

విజయవాడలో ఎస్‌ఈసీని కలిసిన తర్వాత మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆధారాలు ఫోటోగ్రాఫ్స్‌తో పాటు ఇచ్చాం. పల్నాడు జిలాల్లో పోలీసులు నామినేషన్ వేసే వాళ‍్లను అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారు. అన్నమయ్య జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ పత్రాలు చించారు. అన్నమయ్య జిల్లా హింసలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఒక్క సర్పంచ్ అభ్యర్థి కూడా నామినేషన్ వేయకుండా అడ్డుకొన్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్లలో హింస చోటు చేసుకుంది. శ్రీకాళహస్తిలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించారు.

స్వేచ‍్ఛాయుత వాతావరణం అని చెప్పారు.. ఎక్కడా కనిపించడం లేదు. మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనలే మళ్లీ కనిపిస్తున్నాయి. తిరుపతిలో నిన్న ఎస్‌ఈసీ మీటింగ్ పెట్టినా ఉపయోగం లేదు. రాయచోటి గాలివీడులో టీడీపీ శ్రేణులు పెట్రో బాంబులు, కర్రలు తీసుకొని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్‌లో రౌడీ రాజ్యం నడుస్తుంది. నేడు ఘటనలు రేపు ఎల్లుండి నామినేషన్ వేసే సమయంలో జరగకుండా చూడాలి. 

సుప్రీంకోర్టు ఆదేశాలు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలి. వేంపల్లి పంచాయతీని హస్తగతం చేసుకొంటామని టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతున్నారు. పోటీచేసే అభ్యర్థి రైస్ మిల్లు క్లోజ్ చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు. దాడులు, అరాచకాలు అన్ని ఎస్‌ఈసీ దృష్టి కి తీసుకుని వచ్చాం. మంత్రులు, స్థానికంగా అరాచకం సృష్టిస్తున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయాలి. నామినేషన్ వేసే పక్రియ సజావుగా సాగె విధంగా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.

లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రక్రియ సజావుగా ఉంటుందని భావించాం. ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో జరిగిన విధంగా అదే పద్ధతి అమలు చేయాలనీ ఆలోచిస్తున్నారు. అభ్యర్థులను బెదిరించడం, కేసులు పెట్టడం, దొంగ ఓట్లు వేయించే పరిస్థితి వస్తుంది. హైకోర్టు ఆదేశాలు కూడా కొంతమంది అధికారులు అమలు చేయడం లేదు. పంచాయతీ రిజర్వేషన్ అంశాలు కూడా మార్చుతున్నారు’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement