పల్నాడు: రొంపిచర్ల మండలం విప్పర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ వేయడానికి కేంద్రానికి వచ్చాయి టీడీపీలోని రెండు వర్గాలు. కర్రలు, రాళ్లతో రెండు వర్గాలు స్వైర వ్యవహారం చేశాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మరింత చెలరేగింది. వారి నుంచి పోలీసులు పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఉధృతంగా మారడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొడుతున్నారు.


