సర్పంచ్ ఎన్నికలలోనూ చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటు: టీజేఆర్ | It is shameful that Chandrababu Naidu is interfering in the Sarpanch elections TJR | Sakshi
Sakshi News home page

సర్పంచ్ ఎన్నికలలోనూ చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటు: టీజేఆర్

Nov 15 2026 3:33 PM | Updated on Nov 15 2026 3:33 PM

  It is shameful that Chandrababu Naidu is interfering in the Sarpanch elections TJR

తాడేపల్లి: సర్పంచ్ ఎన్నికలలోనూ చంద్రబాబు తలదూర్చటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. బాబు పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదని, మేకతోలు కప్పుకున్న గుంట నక్క లాగ చంద్రబాబు తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు.

‘‘స్థానిక ఎన్నికలలో ఓటు అడిగితే జనం చీపుర్లు తిరగేస్తున్నారు. అందుకే సర్పంచ్ ఎన్నికలలో కూడా అరాచకాలకు దిగారు. మున్సిపల్ ఎన్నికలలో చేసినట్టే దాడులు చేస్తున్నారు. నామినేషన్లు వేయటానికి కూడా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు తొత్తులుగా మారారు. కూటమి పార్టీల అభ్యర్థుల నుండి డబ్బులు తీసుకుని వారికి ఏకగ్రీవం చేస్తున్నారు.

పోలీసులు, ఎన్నికల అధికారులు ఆ డబ్బును పంచుకుంటున్నారు. పల్నాడు జిల్లా పాలపాడులో టీడీపీ అసంతృప్త నేతతోపాటు వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. మంత్రి రాంప్రసాదరెడ్డి స్వయంగా మా పార్టీ వారికి కాల్ చేసి బెదిరిస్తున్నారు. పోలీసులు, టీడీపీ గూండాలను పక్కన పెట్టుకుని మా పార్టీ వారి నామినేషన్ పత్రాలను చించారు. 

ఇలాంటి వారిని మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మా పార్టీ వారిపై దాడులకు దిగారు. రాయలసీమ నుండి పల్నాడు వరకు అన్నిచోట్లా దాడులు, దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద ఖూనీ చేశారు’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement