బుగ్గ మఠం భూములు.. ఏపీ సర్కార్‌కు సుప్రీం నోటీసులు | Supreme Court Given Notice To AP govt | Sakshi
Sakshi News home page

బుగ్గ మఠం భూములు.. ఏపీ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

Jun 2 2025 12:10 PM | Updated on Jun 2 2025 3:31 PM

Supreme Court Given Notice To AP govt

సాక్షి, ఢిల్లీ: ఏపీలోని బుగ్గ మఠం భూముల విషయమై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.

బుగ్గ మఠం భూములపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం, వారం రోజుల్లోగా పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జవాబు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు  ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటివరకు భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement