మాధవి, పావని, మహేశ్వరి, విక్రమ్(ఫైల్ ఫోటోస్)
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పెదగనగళ్లవానిపేట వద్ద సముద్రంలో మునిగి నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద నెక్స్‌్టఎరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆన్‌లైన్, సోషల్ మీడియాలో వచ్చే ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి 125 మంది యువతీ యువకులకు వారం రోజులుగా శిక్షణ ఇస్తోంది.
దసరా సందర్భంగా మంగళవారం సెలవు ప్రకటించడంతో విజయనగరం జిల్లా రామభద్రాపురం ప్రాంతానికి చెందిన మర్రి మహేశ్వరి (18), గొల్లపల్లి పావని (19), కొండ్ల మాధవి (19), పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంకు చెందిన బిడ్డిక విక్రమ్ (25) మరో 21 మందితో కలిసి పెదగనగళ్లవానిపేట బీచ్‌కు వెళ్లారు. అక్కడ నాగావళి, సముద్రం కలిసే ప్రాంతమైన ‘మగ’ వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా మహేశ్వరి, పావని కొట్టుకుపోయి మృతిచెందారు. మాధవి అనే యువతి కూడా కొట్టుకుపోతుండగా బిడ్డిక విక్రమ్ అనే యువకుడు రక్షించేందుకు వెళ్లాడు. అయితే ఇద్దరూ గల్లంతయ్యారు. వీరిద్దరి మృతదేహాలు బుధవారం తీరానికి చేరాయి. రూరల్ ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బిష్ణోయ్ కేసు.. కేంద్రం నిబంధనలు అతనికి ఎలా ప్లస్ అవుతున్నాయి?


