కార్పొరేటర్‌ టికెట్‌ కోసం రూ.50 లక్షలు సిద్ధం చేసుకున్నా.. | TDP Leaders Protest Over GVMC Ticket Allocation, Raise Go Back Vamsi Krishna Slogans In Visakhapatnam | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌ టికెట్‌ కోసం రూ.50 లక్షలు సిద్ధం చేసుకున్నా..

Oct 22 2026 7:58 AM | Updated on Oct 22 2026 8:45 AM

Internal Conflicts Between TDP Leaders

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపు చిచ్చు రేపుతోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి.. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై పలువురు నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ నేతల తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. 

మత్స్యకార బిడ్డకు అన్యాయం! 
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన తనను టికెట్‌ కేటాయింపులో పక్కనపెట్టారని టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో, నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలపై దాడులు జరిగినా.. కేసులు నమోదైనా వెనుకడుగు వేయని తమను కరివేపాకులా తీసిపారేశారని వాపోయారు. టికెట్‌ కోసం రూ.50 లక్షల వరకు సిద్ధం చేసుకున్నా.. ఆ వార్డుతో సంబంధం లేని వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గో బ్యాక్‌ వంశీకృష్ణ! 
మరోవైపు, వంశీకృష్ణ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పలువురు టీడీపీ నాయకులు రోడ్డెక్కి ‘గో బ్యాక్‌ వంశీకృష్ణ’ అంటూ నినాదాలు చేశారు. పాత 35వ వార్డు మాజీ కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. తాను 2,500 ఓట్ల మెజారీ్టతో గెలిచానని, వంశీకృష్ణ శ్రీనివాస్‌ను దక్షిణ నియోజకవర్గానికి తీసుకొచ్చి 65 వేల ఓట్ల మెజారీ్టతో గెలిపించేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ టీడీపీని బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారని, పార్టీ నాయకులను, నాయకత్వాన్ని దెబ్బతీసే విధంగా కపట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 

సీతంరాజు ఇంటి ముందు నిరసన 
టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ ఇంటి ముందు పలువురు కార్పొరేటర్‌ టికెట్‌ ఆశావహులు బుధవారం నిరసన తెలిపారు. పార్టీ ఇన్‌చార్జిని నమ్ముకుంటే నడిసంద్రంలో ముంచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు వార్డుల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినా తమను గుర్తించకపోవడం దారుణమని మండిపడ్డారు. 

ఇదీ చదవండి: జనసేనకు భారీ షాక్‌!..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement