జనసేనకు భారీ షాక్‌!.. | former corporators Resignation To Janasena | Sakshi
Sakshi News home page

జనసేనకు భారీ షాక్‌!..

Oct 22 2026 7:46 AM | Updated on Oct 22 2026 7:46 AM

former corporators Resignation To Janasena

ఇద్దరు మాజీ కార్పొరేటర్ల గుడ్‌బై 

ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరుపై అసంతృప్తి 

పవన్‌ కల్యాణ్‌కు రాజీనామా లేఖ 

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మాజీ కార్పొరేటర్లు గుల్లిపల్లి ఆనందరావు, గుల్లిపల్లి లక్ష్మి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఈ మేరకు లేఖ పంపించారు. రాబోయే జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించకుండా, తూర్పు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులను విశాఖ దక్షిణానికి దిగుమతి చేస్తున్నారని విమర్శించారు. 

స్థానిక నాయకులు, వార్డు ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ తన సొంత అజెండాను రుద్దుతున్నారని మండిపడ్డారు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపించిన స్థానిక నాయకులనే విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిరంకుశ విధానాలను నిరసిస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ ఇద్దరు మాజీ కార్పొరేటర్లు పార్టీని వీడటం జనసేనలో కలకలం రేపుతోంది.  

ఇదీ చదవండి: మేయర్‌ కుర్చీకి.. భరత్‌ రిమోట్‌!


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement