అబద్ధాలతో ఎన్నికల అరాచకాలను కప్పిపుచ్చే కుట్ర | YSRCP Accuses Chandrababu, Lokesh And Pawan Kalyan Of Diverting Attention From Poll Irregularities, Check More Details | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో ఎన్నికల అరాచకాలను కప్పిపుచ్చే కుట్ర

Oct 22 2026 8:18 AM | Updated on Oct 22 2026 9:03 AM

YSRCP Alleges Political Conspiracy In AP

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ఫైర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకుని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, హింసాత్మక రాజకీయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ త్రయం ఎల్లో మీడియాతో కలిసి కుట్ర­పూ­రిత ప్రచారానికి తెరలేపిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజమె­త్తారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లా­డారు. రైతు పొలంలో రోడ్డు వ్యవహారం, సత్యనారాయణకు సంబంధించిన డ్రగ్స్‌ కేసును తెరపైకి తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీపై బురదజల్లే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై సమాధానం చెప్పాల్సిన పాలకు­లు.. సంబంధం లేని అంశాల­ను రాజకీయ ప్రచారానికి వాడు­కోవడం దేనికి సంకే­తమని ప్రశ్నించారు.

‘స్థానిక ఎన్నికల్లో వెన్ను­పోటు పార్టీ అక్రమాలను ప్రజలు గమనిస్తు­న్నారు. నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము ఆ పార్టీకి లేదని తేలిపోయింది. దాన్నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు రోడ్డు ధ్వంసం పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారు. సంబంధం లేని డ్రగ్స్‌ కేసును వైఎస్సార్‌సీపీ నేతకి అంటగట్టారు. ప్రతిపక్ష పార్టీలను, అభ్యర్థుల నామినేషన్లను కూడా అడ్డుకుంటున్న ఈ రాక్షస పాలనకు కాలం చెల్లింది. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు’ అని పుత్తా శివశంకర్‌ హెచ్చరించారు.

ఇదీ చదవండి: మేమున్నాం.. ధైర్యంగా నామినేషన్లు వేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement