గుంపులు గుంపులుగా పచ్చమూకలు.. అధికార పార్టీ లైసెన్డ్ గూండాల్లా.... కర్రలు, కత్తులు, రాడ్లు పట్టి స్వైరవిహారం. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా తలలు పగలకొట్టి, చేతులు విరగ్గొట్టి..నెత్తురోడుతున్న నాయకులను చూసి రాక్షసానందం పొంది..
మరోవైపు టీడీపీ నేతలతో అంటకాగుతూ అధికార పార్టీ తొత్తుల్లా... ఖాకీల వీరంగం. కర్తవ్య నిర్వహణను సైతం పక్కన పెట్టి.. లాఠీలు పట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను వెంటాడి వేటాడి వేధించి చితక్కొట్టి వికటాట్టహాసం..వెరసి ప్రజాస్వామ్య మనుగడను అపహాస్యం చేసినట్టుగా ‘స్థానిక’ సమరాంగణాలు రక్తసిక్తం..




















