ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం | Movement against RTC privatization in AP | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం

Jun 23 2026 5:07 AM | Updated on Jun 23 2026 5:07 AM

Movement against RTC privatization in AP

నేడు, రేపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు 

సాక్షి, అమరావతి: ఈ–బస్సుల ముసుగులో ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ధర్నాలు చేపట్టబోతోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ–బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు తదితర డిమాండ్లతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రా­లు సమర్పించింది. అయినా ప్రభు­త్వం స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతోంది. మంగళ, బుధవారాల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో ధర్నాలు నిర్వహించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement