AP: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు.. లారీని ఢీకొట్టిన కారు | MLC Parvatha Reddy Chandrasekhar Reddy Injured In Road Accident At Nellore - Sakshi
Sakshi News home page

AP: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు.. లారీని ఢీకొట్టిన కారు

Jan 5 2024 9:23 AM | Updated on Jan 5 2024 10:10 AM

MLC Parvatha Reddy Injured In Road Accident At Nellore - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, నెల్లూరు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్వతరెడ్డికి తీవ్రంగా గాయపడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదం అనంతరం, పర్వతరెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు చికిత్స అనంతరం.. మెడికల్‌ సూపరింటెండెంట్‌ శ్రీరామ్‌ సతీష్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి కారు అద్దాలు గుచ్చుకోవడంతో తల భాగంలో గాయాలు ఉన్నాయి. అన్ని పరీక్షలు నిర్వహించాం. బ్రెయిన్‌, చెస్ట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెన్నునొప్పి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు. రెండు వారాలు విశ్రాంతి అవసరం అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement