
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. అంటుంది చట్టం. మరి ఈ విషయంలో రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తారో చూడాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవీరెడ్డి (MLA Madhavi Reddy) గన్‌మేన్ ఆమె హ్యాండ్ బ్యాగును మోస్తూ కెమెరాకు చిక్కారు.
ఇటీవల రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో కలుసుకోవడానికి వెళ్లినప్పుడు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాగ్, దిండు మోశారని ఆయన గన్‌మేన్‌ను చిత్తూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ చర్యను హోంమంత్రి అనిత సమర్థించారు. గన్‌మేన్ భద్రతకు మాత్రమేనని, అతడితో అటెండర్ పని ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. మరిప్పుడు కడప ఎస్పీ ఏ చర్యలు తీసుకుంటారు, హోం మంత్రి ఎలా స్పందిస్తారు.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు.