సీఎం జగన్‌ సుపరిపాలనకు ప్రజల జేజేలు  | It's been four years since formation of YSRCP government | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సుపరిపాలనకు ప్రజల జేజేలు 

May 30 2023 2:43 AM | Updated on May 30 2023 2:43 AM

It's been four years since formation of YSRCP government - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నగరం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరిలో బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలతో సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో జరగిన బైక్‌ ర్యాలీల్లో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో హోం మంత్రి తానేటి వనిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చందన నాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల బైక్‌లతో 25 కిలోమీటర్ల భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ట్రాక్టర్‌ తోలుతూ ర్యాలీలో పాల్గొన్నారు. కడప నగరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమ బాబు, అఫ్జల్‌ఖాన్, ఏపీ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డు ఛైర్మెన్‌ పులి సునీల్‌ కుమార్‌ ర్యాలీని నిర్వహించారు.

బాపట్ల జిల్లా  అమర్తలూరు మండలంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి కూడలి నుంచి సామవాయి మార్గం, అన్నమయ్య మార్గం మీదుగా ర్యాలీ విజయవంతంగా సాగింది. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమే ష్ బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి లక్ష్మీపురం వరకు 16 కిలోమీటర్ల భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి,  ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో, విజయవాడ నగరంలో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement