అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు | Huge Money Containers Stopped On AP Highway This Happens Next | Sakshi
Sakshi News home page

అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు

May 2 2024 5:58 PM | Updated on May 2 2024 5:58 PM

Huge Money Containers Stopped On AP Highway This Happens Next

అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్‌ కాసేపటికే వీడింది.

పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్‌ అమల దృష్ట్యా కలెక్టర్‌, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.

చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్‌ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement