విశాఖలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.. | Huge Foreign Gold Seized In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీగా విదేశీ బంగారం పట్టివేత..

Oct 11 2026 11:13 AM | Updated on Oct 11 2026 11:20 AM

Huge Foreign Gold Seized In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై నిఘా ఉంచిన డీఆర్‌ఐ అధికారులు.. హైవేపై కారును ఛేజ్‌ చేసి మరి పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా వెంబడించి అడ్డుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. నిందితులను విచారించగా అసలు విషయం బయటపడింది.

కారు ముందు ప్రయాణికుడి సీటు కింద కాళ్లు ఉంచే ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరను అధికారులు గుర్తించారు. అందులో మూడు ప్యాకెట్లలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఈ బంగారాన్ని అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చి.. హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అరెస్టయిన నిందితులను న్యాయస్థానంలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. వారిని కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు.. ఆ రాత్రి ఏం జరిగింది?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement