Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Aug 10 2024 7:58 AM | Updated on Aug 10 2024 9:35 AM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,131  మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో  30,998  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం.

దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement