టీడీపీ అక్రమ కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్‌ | YSRCP Former MP Nandigam Suresh Arrested In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

Nandigam Suresh Arrest: టీడీపీ అక్రమ కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్‌

Sep 5 2024 4:59 AM | Updated on Sep 5 2024 11:18 AM

Former MP Nandigam Suresh arrested

సాక్షి, అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత నందిగం సురేశ్‌ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. నందిగం సురేశ్‌ మియాపూర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. 

ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వారిని ఏపీకి తరలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేశ్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే.. వారిని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement