Fact Check: భద్రత ముఖ్యం.. తొందరెందుకు.! | FactCheck: Eenadu Ramoji Rao Fake News On AP Govt Steps About Electric Vehicles, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: భద్రత ముఖ్యం.. తొందరెందుకు.!

Nov 7 2023 5:12 AM | Updated on Nov 7 2023 10:30 AM

Eenadu Fake News On AP Govt Steps about Electric vehicles - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వాహ­నాల (ఈవీల) వినియోగాన్ని ప్రోత్స­­హించడం ఎంత అవసరమో.. వాటి వినియోగదారుల భద్ర­త కూడా అంతే ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్ర­భు­త్వాలు భావిస్తున్నాయి. అందుకే కొనుగోళ్ల సంఖ్య పెంచడంపై కాకుండా విద్యుత్‌ వాహనాలు తగలబడి, అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాయి. కాలిపోకుండా ఉండే బ్యాటరీలను అమర్చాలంటూ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఈ నేపథ్యంలో సురక్షితమైన బ్యా­టరీలతో వచ్చే వాహనాలను ప్రభు­త్వ ఉద్యోగులకు అందించేందుకు రాష్ట్ర ప్రభు­త్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ సదుద్దేశాన్ని వక్రీకరించి ఈనాడు సోమవారం తప్పు­డు కథనాన్ని అచ్చేసింది. ప్రభుత్వంపై బు­రదజల్లడమే పనిగా వక్రభాష్యాలు చెప్పుకొచ్చింది. అసలు నిజాలను న్యూ, రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) వీసీ, ఎండీ ఎస్‌.రమణారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. 

ఆ వివరాలిలా ఉన్నాయి.. 
► కేంద్ర ప్రభుత్యం దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రోత్సాహమిచ్చేందుకు ఫేమ్‌–2 పథకం ద్వారా ఈవీలను కొనే వారికి దాని ధరలో 15 శాతం లేదా కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)కు రూ.10 వేలు ఏది తక్కువైతే అది రాయితీగా ఇస్తోంది. నెడ్‌క్యాప్‌ రుణ సదుపాయం మాత్రమే కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని స్వచ్ఛందంగా పొందవచ్చు. వారికి నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పర్యవేక్షణ అధికారి సంతకంతో దరఖాస్తు సమర్పించాలి. తయారీదారుడి ద్వారా బ్యాంకులే వాహనాన్ని ఏర్పాటు చేస్తాయి. 

► రాష్ట్రంలో దాదాపు 90 లక్షల పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి ద్వారా కాలుష్యం పెరుగుతుండటంతో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థలతో నెడ్‌క్యాప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తోంది. తక్కువ వడ్డీకి నాలుగేళ్ల రుణం, మొదటి వాయిదా (ఈఎంఐ) మాత్రమే ముందుగా చెల్లించి వాహనాన్ని తెచ్చుకునే 
అవకాశం కల్పించింది. 

► ఉద్యోగుల సౌలభ్యం కోసం ఒక వెబ్‌ పోర్టల్‌ని ఏర్పాటు చేసింది. దీనిలో బ్యాంకు ప్రతినిధులు, తయారీదా­రు, ఉద్యోగికి జీతాలిచ్చే అధి­కారి భాగ­స్వాములు. ప్రతి కంపెనీ వాహనం బ్యాటరీ సామర్థ్యం, మైలే­జ్, మోటార్‌ కెపాసిటీ, వేగం వంటి వివరాలన్నీ పోర్టల్‌లో ఉంటాయి. ఉ­ద్యో­­గులు కంపెనీల అవుట్‌లెట్లకు వెళ్లి వివరాలు కనుక్కుని, బండిని ఎంపిక చేసుకునే అవస్థలు లేకుండా పోర్టల్‌ ద్వారా అన్ని కంపెనీల వాహనాల వివ­రాలు తెలుసుకుని, నచ్చిన వాహనా­న్ని ఎంపిక చేసుకోవ­చ్చు. ఇలాంటి ఏర్పాటు దేశం­లో ఎక్కడా లేదు. ఏపీ ప్ర­భుత్వం మాత్రమే చేసింది.  

► విద్యుత్‌ వాహనాల బ్యాటరీ భద్రత ప్రమాణాల్లో కేంద్రం సవరణలు తెచ్చినందున, వాటికి అ­నుగు­ణంగా వాహనాల తయారీకి కంపెనీలకు సమ­యం కావాలి. ఉద్యోగులకు పూర్తిగా ప్రమా­ద ర­హితంగా వాహనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మా­ర్కెట్‌ పరిస్థితులనుబట్టి ఈ కార్యక్రమాన్ని నెడ్‌­క్యాప్‌ ముందుకు తీసుకెళుతుంది. తొందరపాటు­గా వ్యవహరిస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉంది. 

► విద్యుత్‌ వాహనాల మార్కెట్‌ అభివృద్ధి దశలో ఉంది. ప్రజలకు, ఉద్యోగులకు విద్యుత్‌ వా­హ­­నాల లాభాలు, డ్రైవింగ్, చార్జింగ్, నిర్వహణ­పై నెడ్‌క్యాప్‌ నిరంతరంగా అవగాహన కల్పిస్తోంది.  

► 2030 నాటికి పెట్రోల్‌ వాహనాలను దశలవారీగా తొలగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా జాతీయ రహదారుల వెంబడి 25 కిలోమీటర్లకు ఒకటి, నగర పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. ఇప్పటివరకు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఆధ్వర్యంలో 266 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య 65 వేలు దాటింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement