చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌ | Dsc Victims Challenge Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌

Jun 14 2026 2:44 PM | Updated on Jun 14 2026 3:38 PM

Dsc Victims Challenge Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్‌ 14) వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్‌ చేశారు.

‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement