తిరుమల శ్రీవారి దర్శనికి పెరిగిన భక్తుల రద్దీ.. | Crowd Of Devotees Increased In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి దర్శనికి పెరిగిన భక్తుల రద్దీ..

Sep 18 2024 8:37 AM | Updated on Sep 18 2024 9:51 AM

Crowd Of Devotees Increased In Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ కృష్ణతేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది.   మంగళవారం అర్ధరాత్రి వరకు 72,072 మంది స్వామివారిని దర్శించుకోగా 30,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement