కుప్పం: మద్యం మత్తులో ఐఏఎస్‌ వికాస్ మర్మత్ వీరంగం | Criminal Charges against Kuppam IAS Officer Vikas Marmat | Sakshi
Sakshi News home page

కుప్పం: మద్యం మత్తులో ఐఏఎస్‌ వికాస్ మర్మత్ వీరంగం

Oct 13 2026 10:34 AM | Updated on Oct 13 2026 11:22 AM

Criminal Charges against Kuppam IAS Officer Vikas Marmat

సాక్షి,బెంగళూరు: చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (కడ-kada), ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాదంలో చిక్కుకున్నారు.  బెంగళూరుకు చెందిన ఓ పబ్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుర్భాషలాడారు. ఈ ఘటనలో బెంగళూరు పోలీసులు వికాస్‌ మర్మత్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.  

పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్ పబ్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు సదరు పబ్‌లో తనిఖీలు చేపట్టారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..  ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ అక్కడే ఉన్నారు. 

మద్యం మత్తులో ఉన్న ఆయన, విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లారు. అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాదు. రెచ్చిపోయి ప్రవర్తించారు.

నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు..
ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐఏఎస్ వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ అనే వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

కబ్బన్ పార్క్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 150/2026 కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేసి,దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి పబ్‌లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం చర్చాంశనీయంగా మారింది.  

ఇదీ చదవండి : ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement