ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్‌ జగన్‌ | Velpucharla Woman Meets Ys Jagan At Gannavaram Airport | Sakshi
Sakshi News home page

ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్‌ జగన్‌

Oct 13 2026 10:28 AM | Updated on Oct 13 2026 10:56 AM

Velpucharla Woman Meets Ys Jagan At Gannavaram Airport

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ దుస్థితిని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఓ కుటుంబం.. ఆయన దృష్టికి తీసుకొచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వైఎస్‌ జగన్‌ను ముసునూరు మండలం వేల్పుచర్లకు చెందిన మహిళ జంగం మాధవి కలిశారు. తన18 నెలల పాప వినికిడి లోపంతో బాధపడుతుందని వైఎఎస్‌ జగన్‌ దృష్టికి తల్లి మాధవి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తించదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లి ఆవేదనకు వైఎస్‌ జగన్‌ చలించిపోయారు.

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్‌లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ బలోపేతం చేసిన సంగతి తెలిసిందూ. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్‌లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్‌ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్‌లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి.

ఇదీ చదవండి: దుబారా బాబు.. డిజిటల్‌ డాబు

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement