రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు | CM YS Jagan Extends Dussehra Greeting To Telugu People | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ దసరా శుభాకాంక్షలు

Oct 21 2023 6:56 PM | Updated on Oct 21 2023 7:34 PM

CM YS Jagan Extends Dussehra Greeting To Telugu People - Sakshi

తాడేపల్లి :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

‘ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం..  నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలి’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement