కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్‌! | Chandrababu Naidu government decides to withdraw Disha Bill | Sakshi
Sakshi News home page

కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్‌!

Aug 7 2026 5:31 AM | Updated on Aug 7 2026 5:31 AM

Chandrababu Naidu government decides to withdraw Disha Bill

మహిళలకు రక్షణ కవచంలా నిలిచిన ‘దిశ’ బిల్లు ఉపసంహరణకు చంద్రబాబు సర్కారు నిర్ణయం 

మహిళల భద్రత కోసం విప్లవాత్మక ‘దిశ’ బిల్లు తెచ్చిన వైఎస్‌ జగన్‌ 

‘దిశ’ యాప్‌తో చేతిలో భద్రతా∙పరికరంగా మొబైల్‌ ఫోన్‌.. 

ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ ఊపితే చాలు 15 నిమిషాల్లో పోలీసులు వచ్చి బాధితురాలిని రక్షించే ఏర్పాటు 

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు, నేరస్తుడి అరెస్టు నుంచి శిక్ష పడేవరకు వేగంగా చర్యలు 

ప్రత్యేక పోలీసు వ్యవస్థ.. ప్రత్యేకకోర్టులు.. గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు 

దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌ చరిత్రాత్మక చర్యలు 

లక్షలాది మందికి రక్షణ.. నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు 

దిశ బిల్లు ఉపసంహరణ నిర్ణయం ద్వారా మహిళల భద్రతపై తన నైజాన్ని చాటుకున్న చంద్రబాబు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.

చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. 

మహిళల భద్రత కోసం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక చర్యలు 
రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు’ను  తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. 

దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్‌ఓఎస్‌ కాల్స్‌ ఆధారంగా భారీగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్‌ నివేదిక, చార్జిïÙట్‌ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్‌ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 

19 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. 

అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. 

దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్‌ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు­్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్‌ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్‌ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. 

రమ్య హత్య కేసులో మరణ శిక్ష 
దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్‌ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్‌ నుంచి 2022 ఏప్రిల్‌ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు.  

‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకం
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా  
సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్‌ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్‌న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్‌కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్‌ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు.  వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్‌ చేశారు.  

మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం 
‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.  – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి 

దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి 
దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.   – మాజీ మంత్రి విడదల రజిని

మహిళల భద్రతకు పెను విఘాతమే 
మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్‌ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే.   – జి. తనూజా రాణి, ఎంపీ 

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి 
ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.  – కాకాణి పూజిత, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం
మహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్‌ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు.     – చింతా అనూరాధ, మాజీ ఎంపీ 

మహిళల విశ్వాసానికి పాతర 
వైఎస్‌ జగన్‌ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్‌ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.   – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement