breaking news
DISHA
-
రాజకీయ ఈర్ష్యతో ‘దిశ’ రద్దు దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మహిళల భద్రతలో దేశానికే దిశా నిర్దేశం చేసిన ‘దిశ’ను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్య తో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మంత్రివర్గం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వానికి హితవు పలుకుతూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శుక్రవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మహిళలు, చిన్నారులకు రక్షణ వ్యవస్థగా నిలిచిన ‘దిశ’‘దిశ’ను ఉపసంహరించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులకు ఒక చీకటి రోజు. మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర‡్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరం. మహిళలు, చిన్నారులపై నేరాలు, దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘దిశ’ను తీసుకొచ్చింది.నేరం జరగకుండా నిరోధించడం నుంచి, నేరం జరిగితే వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ, వేగంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చార్జిషీటు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించాం. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థ తీసుకొచ్చాం. 1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘దిశ’ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను అప్పట్లో మా ప్రభుత్వంలో పోలీసులు పరిష్కరించారు. 18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసును అందుబాటులోకి తీసుకొచ్చి 13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించాం. 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా ఈ కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేశాం. సత్వర విచారణ కోసం 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. 2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్‌ను రూపొందించాం. అందుకనే ‘దిశ’ విజయవంతంగా మహిళలకు, చిన్నారులకు గొప్ప భద్రతా సేవలను అందించింది. నిందితుడికి శిక్షపడే వరకూ రక్షణ నెట్వర్క్ 2017లో మహిళలపై నేరాల దర్యాప్తుకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి అది 28 రోజులకు తగ్గించగలిగారు. 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేశారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోపు అరెస్టు చేశారు. గతంలో డీఎన్ఏ నివేదికలకు నెలలు పట్టేది. ‘దిశ’ ఫోరెన్సిక్ వ్యవస్థతో వాటిని రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చాం. 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మే 2024 నాటికి మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. వార్షిక సగటు కేసులు 14,338 నుంచి 10,426కు తగ్గాయి. ఇదీ ‘దిశ’ ఇచ్చిన భరోసా.. ఇవీ ‘దిశ’ సాధించిన ఫలితాలు. అందుకే 19 జాతీయ అవార్డులను మా ప్రభుత్వ హయాంలో ‘దిశ’ గెలుచుకుంది. ‘దిశ’ అనేది కాగితాల మీదున్న పేరు కాదు. ప్రమాదంలో ఉన్న మహిళ ఎస్‌వోఎస్ నొక్కిన క్షణం నుంచి, నిందితుడికి శిక్ష పడే వరకు ఆమెకు అండగా ఉండే సజీవమైన మహిళా రక్షణ నెట్వర్క్.నేరస్తుల్లో చట్టంపై భయం తగ్గిస్తోంది ‘దిశ’ను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోంది. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది. మహిళలు తమ రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోంది. మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ‘దిశ’ను రద్దు చేయడం కాదు– రక్షించాలి. ‘దిశ’ను నిర్వీర్యం చేయడం కాదు–మరింత బలోపేతం చేయాలి.న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ఎలా ప్రత్యామ్నాయం?ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ‘బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చాలు, దిశ అవసరం లేదు’ అంటోంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌వోఎస్ వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు, గ్రామ స్థాయి నుంచే మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్, లైంగిక నేరస్తుల డేటా బేస్, వేగవంతమైన ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తుతో కూడిన న్యాయం అనే లక్ష్యానికి బీఎన్ఎస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? మహిళలు, చిన్నారులపై తీవ్రమైన దారుణాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు, ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసేలా ‘దిశ’ ద్వారా తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 21 రోజుల్లోగా బాధితులకు న్యాయం అందించాలన్న అలాంటి లక్ష్యాన్ని కూడా ఈ ప్రభుత్వం విమర్శించడం మరింత బాధాకరం. ఆ లక్ష్యం వెనుక ఉద్దేశం ఒక్కటే. దర్యాప్తులో జాప్యం ఉండకూడదు.. విచారణలో ఆలస్యం ఉండకూడదు.. మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా విచారించాలి.. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో ఉండాలి. అలాంటి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యాన్నే తప్పు పట్టడం మహిళలకు ఏ సందేశం పంపుతోంది? మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ ప్రభుత్వానికి అభ్యంతరమా?1.51 కోట్ల మంది ‘దిశ’ యాప్ డౌన్లోడ్31,607 అత్యవసర కాల్స్ పరిష్కారం18 ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్లు.. గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులు13,500 మందితో క్షేత్ర స్థాయి భద్రత, రిపోర్టింగ్ వ్యవస్థ900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్ఆరు నగరాల్లో ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం, 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు2,17,467 మంది లైంగిక నేరస్తుల వివరాలతో ప్రత్యేక డేటా బేస్ అందువల్లే ‘దిశ’తో గొప్పగా భద్రతా సేవలు.. 19 జాతీయ అవార్డులు -
కీచక పాలనలో కీలక బిల్లు డ్రాప్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల భద్రత తమకు ఏమాత్రం పట్టదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చరిత్రాత్మకమైన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు సర్కారు తన నైజాన్ని బయటపెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోయాయి.చంద్రబాబు కూటమిలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతల వరకు అనేక మంది మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. నిత్యం అనేక మంది కూటమి కీచకుల బారిన పడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదు. చివరకు ఓ ఎన్నారై మహిళను చంద్రబాబు కేబినెట్లోని మంత్రే వేధించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును చట్టంగా మార్పించాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలు రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు’ను తెచ్చారు. మహిళలకు ఇది ప్రత్యేక రక్షణ కవచంలా నిలిచింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించారు. ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు.. ఎస్‌వోఎస్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోగా పోలీసులు బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆమెను రక్షించే వారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్, ఎస్ఓఎస్ కాల్స్ ఆధారంగా భారీగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, గృహ హింస, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, ఈవ్‌టీజింగ్, హత్యాయత్నం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నుంచి నేరస్తుడి అరెస్టు, ఫోరెన్సిక్ నివేదిక, చార్జిïÙట్ నుంచి ప్రత్యేక కోర్టులో శిక్ష వరకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థతో నిరి్మంచిన సమగ్ర మహిళా భద్రతా వ్యవస్థ దిశ బిల్లు. మహిళలకు ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలను అందించారు. 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల కోసం మరో 13 ప్రత్యేక కోర్టులను గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ చర్యలతో మహిళలపై నేరాల దర్యాప్తు సమయం కూడా 156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గించారు. 2017లో మహిళలపై నేరాల దర్యాప్తు పూర్తి చేయడానికి సగటున 156 రోజులు పట్టేది. 2021 నాటికి ఇది 67 రోజులకు, 2022లో 28 రోజులకు తగ్గింది. అత్యాచారం, పోక్సో కేసుల్లో 60 రోజుల్లో పూర్తి చేసిన దర్యాప్తులు 2019లో 14.15 శాతం కాగా, ఇది 2020లో 41.7 శాతం, 2021లో 92.21 శాతం, 2022లో 95.18 శాతానికి పెరిగాయి. లైంగిక నేరాల దర్యాప్తులో దేశ సగటు 40 శాతం కాగా ఏపీ 92.21 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 2019–2022 మధ్య నమోదైన అత్యాచారం – హత్య కేసుల్లో 60 శాతం నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో అరెస్టుకు సగటున 43 రోజులు పట్టగా, దిశ కాలంలో 8 రోజులకు తగ్గింది. త్వరగా అరెస్టు చేయడం ద్వారా నిందితులు తప్పించుకునే అవకాశాన్ని తగ్గించారు. దేశానికే దిశా నిర్దేశం చేసేలా జగన్ తెచ్చిన ఈ విప్లవాత్మక బిల్లుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 19 అవార్డులు కూడా లభించాయి. 2024లో చంద్రబాబు సర్కారు రాగానే మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. దిశ బిలు్లకు కేంద్రం ఆమోదం రాలేదనే సాకుతో దిశ యాప్, పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌డెస్‌్క, ఫోరెన్సిక్ వ్యవస్థ, ప్రత్యేక కోర్టులు, పెట్రోలింగ్, దర్యాప్తు పర్యవేక్షణ వంటి మొత్తం వ్యవస్థకు పాతరేసింది. రమ్య హత్య కేసులో మరణ శిక్ష దిశ వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసు ఓ ఉదాహరణ. ఈ కేసులో నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేసి, 7 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేశారు. విచారణను వేగంగా పూర్తి చేయడంతో నిందితుడికి మరణశిక్ష పడింది. 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 214 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. వీటిలో ముగ్గురికి మరణించే వరకు జీవిత ఖైదు, 19 మందికి జీవిత ఖైదు, పలువురికి 20 ఏళ్లు, 10 ఏళ్లు తదితర శిక్షలు విధించారు. ‘దిశ’ ఉపసంహరణతో మహిళల భద్రత ప్రశ్నార్థకంమాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజా సాక్షి, అమరావతి: ‘దిశ’ ఉపసంహరణ మహిళా భద్రతకు బ్లాక్ డే అని, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దిశను రద్దు చేయడంతో మహిళల భద్రత ప్రశ్న్రా్థకంగా మారిందని మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆర్కే రోజాలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ తప్పుడు నిర్ణయంతో మహిళలపై దారుణాలకు ప్రభుత్వమే వత్తాసు పలికినట్లయిందన్నారు. కేవలం జగన్ చేసిన మంచి పని మిగిలి ఉండకూడదనే దురుద్దేశంతోనే దిశను రద్దు చేసిందన్నారు. వెంటనే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు. మహిళల భద్రతను సమాధి చేసే చీకటి నిర్ణయం ‘దిశ’ను తొలగించడం అంటే కేవలం ఒక బిల్లును ఉపసంహరించడం కాదు చంద్రబాబు గారూ.. మీరు ఇచ్చిన మహిళలకు భద్రత, చిన్నారులకు రక్షణ, బాధితులకు త్వరిత న్యాయం అనే హామీని వెనక్కి తీసుకున్నట్టే. మహిళల భద్రతను సమాధి చేసే ఈ చీకటి నిర్ణయమిది. తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో చంద్రబాబు చెప్పాలి దిశ వ్యవస్థ వల్ల మహిళలకు జరిగిన నష్టం ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా చంద్రబాబూ? నష్టం లేకపోతే మహిళలకు అదనపు రక్షణ కల్పించే వ్యవస్థను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు? మహిళలు, చిన్నారులపై అత్యంత తీవ్రమైన నేరాల్లో 21 రోజుల్లో దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యం తప్పా? మహిళ చేతిలోని భద్రత ఆయుధాన్ని నిరీ్వర్యం చేస్తున్న మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – మాజీ మంత్రి విడదల రజినిమహిళల భద్రతకు పెను విఘాతమే మహిళలు, చిన్నారులకు దిశ రూపంలో ఉన్న రక్షణ కవచాన్ని చంద్రబాబు ప్రభుత్వం తొలగించడం దుర్మార్గం. కేబినెట్ తీసుకున్న ఈ చీకటి నిర్ణయం మహిళల భద్రతకు పెను విఘాతమే. – జి. తనూజా రాణి, ఎంపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ఒక మహిళా హోం మంత్రిగా అనిత దిశ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, దాన్ని తొలగించే నిర్ణయాన్ని సమర్థించడం దురదృష్టకరం. మహిళల నమ్మకాన్ని దెబ్బ తీసిన హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలి. మహిళల భద్రతను రాజకీయాలకు బలి చేసినందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గంమహిళలకు రక్షణ కల్పించాల్సిన కేబినెట్ వారి రక్షణ కవచాన్ని తొలగించడం దుర్మార్గం. మహిళల భద్రత కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘దిశ‘ మోడల్‌ను ఏపీ ప్రభుత్వమే తొలగించడం సిగ్గుచేటు. – చింతా అనూరాధ, మాజీ ఎంపీ మహిళల విశ్వాసానికి పాతర వైఎస్ జగన్ మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నిర్మించారు. ఆ వ్యవస్థనే వెనక్కి తీసుకెళ్లడం చంద్రబాబుకు మహిళల భద్ర పట్టదనడానికి నిదర్శనం. మహిళల విశ్వాసాన్ని కేబినెట్ నిర్ణయంతో తుడిచి పెట్టేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. – వరదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
‘కోర్టులోనే తేల్చుకుంటా’.. దిశ కేసుపై ఆదిత్య ఠాక్రే!
ముంబై: ఐదేళ్ల క్రితం చనిపోయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సాలియన్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. దిశ సాలియన్ ముంబైలోని ఓ భవనం నుంచి పడిపోవడంతో మరణించారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా అప్పట్లో కేసు నమోదు చేశారు. తాజాగా శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేయాలని దిశ తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెది ప్రమాదవ శాత్తూ జరిగిన మరణం కాదని, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి, హతమార్చారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఆదిత్య ఠాక్రే స్పందించారు. న్యాయ స్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే దిశ సాలియన్ జూన్8,2020 ముంబైలోని మలాద్ అనే ప్రాంతానికి చెందిన అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌లో(ఏడీఆర్)ప్రమాదవశాత్తూ మరణించినట్లు కేసు నమోదు చేశారు. సరిగ్గా ఆ ఘటన జరిగిన ఆరురోజుల తర్వాత బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాదాస్పద స్థితిలో మరణించారు.దిశ సాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు దిశ సాలియన్, సుశాంత్ సింగ్ రోజుల వ్యవధిలో ఇద్దరూ అనుమానాస్పదంగా మరణించడంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ పడి చనిపోయినట్లు తేల్చారు. పోలీసుల దర్యాప్తుపై దిశ తండ్రి సైతం సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంలో ఎలాంటి అనుమానం లేదని, కేసు దర్యాప్తుపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా ఐదేళ్ల తర్వాత దిశ సాలియన్ కేసు ఊహించని మలుపు తిరిగింది. గురువారం దిశ తండ్రి సతీష్ సాలియన్ సంచలన ఆరోపణలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కింద పడితో ఒక్క దెబ్బకూడా తగల్లేదంట ఆ పిటిషన్లో జూన్ 8,2020లో దిశ తన ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసిందని,ఆ పార్టీకి శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, అతని బాడీ గార్డ్లు, నటులు సూరజ్ పంచోలి,డినో మోరియాలు పాల్గొన్నారని తెలిపారు. పార్టీలో తన కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైందని, బలవంతంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు గురైంది’ అని ఆమె తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిందపడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో రక్తం లేదని అన్నారు. అటాప్సీ రిపోర్ట్‌పై అనుమానం కేసులో నిందితుల్ని రక్షించేందుకు రాజకీయ పలుకుబడితో దిశ అటాప్సీ రిపోర్ట్‌ను సైతం మార్చారని తెలిపారు. అందుకు ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలే నిదర్శనమన్నారు. నిందితుల్ని కేసు నుంచి భయటపడేసేందుకు రాజకీయ పలుకుబడితో పోలీస్ శాఖ దిశ ప్రమాదవశాత్తూ మరణించారని బలం చేకూరేలా అటాప్సీ రిపోర్ట్‌ను మార్చారని పిటీషన్లో వెల్లడించారు.అంతేకాదు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేయడం, సీసీటీవీ ఫుటేజీలను మార్చడం, పోస్టుమార్టం రిపోర్ట్‌పై ఎలాంటి అనాలసిస్ చేయకుండా హడావిడిగా దహన సంస్కారాలు చేశారని, పొలిటికల్ లీడర్ల ప్రోద్బలంతో పోలీసులు కేసును నీరు గార్చారని చెప్పారు.పిటిషన్లో సుశాంత్ గురించి ప్రస్తావిస్తూదిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో నటుడు సుంశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ప్రస్తావించారు. మరణించిన రోజే సుశాంత్ సింగ్ భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు.కానీ తన కుమార్తె డెడ్ బాడీని 50 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం తీసుకుని పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టు మార్టం ఆలస్యం వెనక లైంగిక దాడి సాక్ష్యాల్ని ధ్వంసం చేయడం, ప్రధాన నిందితుడు ఆదిత్యా ఠాక్రేను రక్షించే ప్రయత్నం చేసినట్లు మరిన్ని ఆరోపణలు చేశారు. సీబీఐకి అప్పగించాలి కాబట్టి, తన కుమార్తె దిశా మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు, 2023లో మానవ హక్కుల సంఘం నేత, సుప్రీం కోర్టు,హై కోర్టు లిటిగెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీద్ ఖాన్ పఠాన్ దాఖలు చేసిన మునుపటి పిటిషన్‌తో తాను దాఖలు చేసిన ఈ కొత్త పిటిషన్‌ను అనుసంధానించాలని అభ్యర్థించారు. దిశ మరణంపై ముంబై పోలీసు చీఫ్‌కి రషీద్ ఖాన్ పఠాన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో దిశా మరణంలో నిందితులుగా ఉన్న వ్యక్తిలపై హత్యానేరం కింద అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఆ ఫిర్యాదును సైతం పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. 2023లో మహారాష్ట్ర ప్రభుత్వం దిశ మరణంపై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT)ఏర్పాటు చేసింది. కానీ సిట్ దర్యాప్తు అధికారులు దిశ సాయిలిన్ రిపోర్టు ఇంకా సమర్పించలేదు.అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధందిశ సాలియన్ తంత్రి సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐదేళ్ల తర్వాత 228 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం దిశ మరణిస్తే.. ఇప్పుడే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్నది. సమాధిని తొలగించాలంటూ నాగ్‌పూర్‌లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఆ వివాదం నుంచి భయటపడేందుకే దిశసాలియన్ కేసును తెరపైకి తెచ్చారని మాట్లాడారు. శివసేన ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే సైతం స్పందించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రయత్నిస్తున్నారని, న్యాయస్థానంలో ఈ అంశంపై స్పందిస్తామని అన్నారు. మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాట్ దిశ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాని అన్నారు. తన కుమార్త మరణాన్ని తట్టుకోలేక దిశ తండ్రి బహిరంగంగా ముందుకు వచ్చి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. -
శివసేన యువ నేతను వెంటాడుతున్న ‘దిశ’ కేసు
శివసేన (యూబీటీ) యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టుకెక్కారు. తన కూతురు మరణం కేసులో ఠాక్రేను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరినట్టు పీటీఐ వెల్లడించింది.అసలేం జరిగింది? 2020, జూన్ 9న దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయింది. ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ప్రియుడు రోహన్, మరికొంత మందితో కలిసి ఆమె పార్టీలో పాల్గొంది. ఈ నేపథ్యంలో దిశపై లైంగిక దాడి చేసి చంపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించిందని కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి.‘ఆమె మరణం వెనుక వారి హస్తం’దిశ మరణించి వారం రోజులు కూడా గడవకముందే, అంటే 2020, జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వీరిద్దరి మరణాలకు ఏదైనా లింకు ఉందేమోనని అప్పట్లో అనుమానాలు రేగాయి. అయితే దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని అప్పటి బీజేపీ ఎంపీ నారాయన్ రాణె ఆరోపించడంతో సంచలనం రేగింది. ఆమె మరణం వెనుక రాజకీయ నేతలు, బాలీవుడ్‌కు చెందిన వాళ్ల హస్తం ఉందని ఆరోపించారు. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని సుశాంత్‌తో దిశ చెప్పిందని.. దీంతో అతడిని వాళ్లు వేధించడం మొదలుపెట్టారని, అందుకే సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోసారి తెరపైకి ఠాక్రే పేరు ఇదే అంశాన్ని ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే 2022, డిసెంబర్లో లోక్‌సభలో లేవనెత్తారు. సుశాంత్ మృతి కేసులో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనపై ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) కొట్టిపారేశారు. ఠాక్రేపై కేసు నమోదు చేసి విచారించాలని దిశ తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించడంపై తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.చదవండి: జట్కా మటన్ అంటే ఏంటి.. ఎక్కడ దొరుకుతోంది?అత్యాచారం చేసి హత్య చేశారుదిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, దీని వెనుకున్న కొంత మంది రాజకీయ ప్రముఖులను కాపాడటానికి కుట్రపూరితంగా కేసును తప్పుదోవ పట్టించారని దిశ తండ్రి తాజాగా రోపించారు. ముంబై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామని మొదట్లో తాము నమ్మామని, కానీ కేసును కప్పిపుచ్చారని అనుమానాలు కలుతున్నాయన్నారు. "ముంబై పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు, సందర్భోచిత రుజువులు, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు మరణం కేసుగా తేల్చి హడావిడిగా ముగించారు" అని తన పిటిషన్లో పేర్కొన్నారు.‘తెర వెనుక రాజకీయ కుట్ర’దాదాపు ఐదేళ్ల తర్వాత దిశా సాలియన్ కేసులో మళ్లీ ఆదిత్య ఠాక్రే పేరును తెరపైకి తేవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) పేర్కొన్నారు. ఠాక్రే కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి నిరంతరాయంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిపై ఈ విధంగా కుట్రలు చేయడం మహారాష్ట్ర సంస్కృతి కాదన్నారు. ఇలాంటి ఆరోపణలు తమ లాంటి నాయకులపై చాలానే చేశారు కానీ అవేవీ నిరూపితం కాలేదని గుర్తు చేశారు. ఔరంగజేబు వివాదం నుంచి ప్రజల చూపును మళ్లించేందుకు ఐదేళ్ల తర్వాత ఈ కేసును మళ్లీ ఇప్పుడు తెరపైకి తెచ్చారని రౌత్ ఆరోపించారు. శివసేన (యూబీటీ) పార్టీ ప్రతినిధి కిషోరి పెడ్నేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
Disha APP : హోంమంత్రి అనితకు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి కౌంటర్
-
అనితమ్మా.. సిగ్గు.. సిగ్గు..
పసి పాపలు.. అభం శుభం తెలీని బాలికలు.. ప్రతిఘటించలేని దివ్యాంగులు.. ఎందరెందరో చిన్నారులను చిదిమేశారు. లైంగిక దాడితో తీరని గాయం చేశారు.. కొందరి ప్రాణాలు కూడా తీశారు.. జిల్లాలో మహిళలపై అత్యాచారాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా పోక్సో కేసులు( ఎక్కువయ్యాయి. పట్టపగలు నడి రోడ్డుపై నడిచేందుకు కూడా జడవాల్సిన దుస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేటి వరకు జిల్లావ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దిశ పోలీస్ స్టేషన్లు(Disha Police Station) మూసేశారు. దిశ యాప్‌కు మంగళం పాడారు. ఆఖరికి లైంగిక దాడుల కేసులను త్వరగా తేల్చడానికి ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా వద్దనుకున్నారు. అందుకే మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు సైతం కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆమె సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇది ఆమెకే సిగ్గుచేటు. సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల భద్రతకు కరువైంది. ఒక మహిళా హోంమంత్రి(Anitha Vangalapudi) సొంత జిల్లాలోనే బాలికలకు, మహిళలకు భద్రత లేకపోతే .. రాష్ట్రంలో అతివల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల యలమంచిలి మండల పరిధిలో రెండు మూడు వారాల వ్యవధిలోనే ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో మహిళా భద్రతకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను, దిశ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టులను నిర్వహించారు. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడాలన్నా.. అఘాయిత్యం చేయాలన్నా భయపడేలా ఉండేది. అంతేకాకుండా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్షలు కూడా పడేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోక్సో కేసులు పెరిగాయి. వీటిలో రోలుగుంట మండలంలో జేసీ అగ్రహారంలో దివ్యాంగ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులోనే ముద్దాయికి శిక్ష పడింది. మిగతా అన్ని కేసులు దర్యాప్తులో ఉన్నాయి. యలమంచిలిలో 8వ తరగతి విద్యారి్థనిపై స్వయాన బావే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనకాపల్లి టౌన్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న ఆ బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించినరు. ఇలా ఒకటి కాదు జిల్లాలో 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలపై కఠిన శిక్షలు విధించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని పసిపాపలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలకు కఠిన శిక్షలు విధిస్తే మరొకరు చేయడానికి భయపడతారంటూ మహిళా సంఘాల నేతలు సూచిస్తున్నారు. వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షించాలి. లేదంటే వారు మరింత విజృంభిస్తారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల భద్రతపై ఫోకస్ పెట్టి దిశ యాప్‌ను, దిశ పోలీస్స్టేషన్లను మళ్లీ పునరుద్ధరించాలి. జిల్లాలో గత ఏడాది జూన్ 4 తరువాత నుంచి నమోదైన పోక్సో కేసుల్లో ప్రధానమైనవి..జూలై 6: రోలుగుంట మండలం జేసీ అగ్రహారానికి చెందిన 16 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై అదే ప్రాంతానికి చెందిన మోటార్ మెకానిక్ దాసు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో కేసు నమోదు చేయగా.. కోర్టు దాసుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జూలై 7: రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 14 ఏళ్ల మైనర్ బాలికను సురేష్ అనే యువకుడు ప్రేమోన్మాదం పేరిట అత్యాచారం చేసి హత్య చేశాడు. మరుసటిరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్టోబర్ 15: యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లైన్కొత్తూరులో గల న్యూలైఫ్ హాస్టల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై హాస్టల్ కేర్‌టేకర్(వార్డెన్) రావాడ శ్రీను వేధింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 19: అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో కుమారపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అదే గ్రామానికి చెందిన రెడ్డి అశోక్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్టోబర్ 22: యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8వ తరగతి బాలికపై బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 25: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆర్.శివ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 29: యలమంచిలి పట్టణం రామ్‌నగర్‌లో ఒక వివాహిత తనకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేశారని ఫిర్యాదు చేయగా భర్తపై పోక్సో కేసు పెట్టారు. అక్టోబర్ 30: అర్ధరాత్రి అనకాపల్లి గవరపాలెంలో సంతోషిమాత ఆలయ రహదారి సమీపంలో అమ్మమ్మ ఇంటి వద్ద నిద్రిస్తున్న 12 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల యల్లపు శ్రీరామ్మూర్తి అత్యాచారం చేసేందుకు యత్నంచాడు. జనవరి 28: యలయంచిలిలో 13 ఏళ్ల బాలికను హాకీ కోచ్ రూపేష్ అత్యాచారం చేశాడు. బాలికలకు కోచ్‌గా ఉంటూ హాకీ నేర్పస్తామని లైంగిక దాడికి పాల్పడ్డాడు. జనవరి 11: ఏటికొప్పాకలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. భయపడకుండా ఫిర్యాదు చేయాలి.. గంజాయి, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిసై బాలికలపై లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భయపడకుండా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే వారికి శిక్ష పడుతోంది. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోలీసులు అవగాహన కల్పించాలి. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడితే వారికి పడే శిక్షలపై ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించా. – కరణం కృష్ణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, విశాఖ పోక్సో కోర్టువిద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు జిల్లాలో ప్రతి పాఠశాల, కళాశాలల్లో సంకల్పం పేరిట విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే వేసే శిక్షల గురించి వివరిస్తున్నాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై కూడా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నేరాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో ఈ ఏడాదిలో నమోదైన పోక్సో కేసుల్లో ధర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. మైనర్ బాలికలపై, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్లో లేదా సచివాలయంలో ఉన్న మహిళ కానిస్టేబుల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే నేరుగా 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. – తుహిన్ సిన్హా, జిల్లా ఎస్పీముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి -
నిధుల వినియోగంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం
- కేంద్ర నిధులను మళ్లిస్తున్నారంటూ మండిపాటు - ప్రతి పనిలో జన్మభూమి కమిటీలతో పనేంటి? - దిశా సమావేశంలో సభ్యుల ధ్వజం కర్నూలు(హాస్పిటల్): నిరుపేదల అభ్యున్నతి కోసం వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ(దిశా) అధ్యక్షురాలు, ఎంపీ బుట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగంపై ఎంపీతోపాటు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద గత ఏడాది రూ.588కోట్లతో 196లక్షల పనిదినాలు లక్ష్యం కాగా రూ.435కోట్లతో 164లక్షల పనిదినాలే కల్పించారని చెప్పిన ఎంపీ.. లక్ష్యసాధనలో లోపాలను డ్వామా పీడీ పుల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో పనేంటని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద మంజూరైన నిధులు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉంచి రెండు నెలల్లోనే రూ.180కోట్ల పనులు మంజూరు చేయడంపై ఆరా తీశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 105రోడ్ల మరమ్మతుల నిర్వహణకు సంబంధించి నివేదికలు అందజేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడిని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పేదల ఇళ్లకు సంబంధించి వెయ్యి దరఖాస్తులిచ్చారని, అవి ఏఏ దశలో ఉన్నాయని ప్రశ్నించగా పరిశీలించి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్ నివేదించారు. ‘ఉపాధి’ కింద లక్ష్యాన్ని మించి మంజూరు : కలెక్టర్ నీటి సంరక్షణ విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాన్ని మించి మంజూరు ఇచ్చామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఉపాధి పనుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. నగరానికి తాగునీటి విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని వివరణ కోరగా గాజులదిన్నె ప్రాజెక్టులో 0.51టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ప్రస్తుతం ఇస్తున్న విధానంలో నీటిని విడుదల చేస్తే జూన్ చివరి వరకు సరిపోతాయన్నారు. పల్లెల్లో తాగునీటి విషయమై చర్చకు రాగా డీపీఓ సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీకి ఆదేశాలిచ్చారు. తన ఆదర్శ గ్రామాల్లో ఒక్క పని మొదలు కాలేదంటూ జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ను ఎంపీ ప్రశ్నించగా టెండర్ దశలో ఉన్నాయని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవాలన్నా జన్మభూమి కమిటీని అడగాలా? – బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పెళ్లి చేసుకోవాలన్నా తమను అడగాలనే ధోరణిలో జన్మభూమి కమిటీలు వ్యవహరిస్తున్నాయి. ఏ స్కీమ్ వచ్చినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పారని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తీసేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకునేందుకు వారితో పనేంటి? ఎమ్మెల్యేగా ఉన్నా మరుగుదొడ్డి, ఇళ్లు, బోరు మంజూరు చేయించే అధికారం నాకు లేకుండా పోయింది. డీఆర్డీఏ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఎందుకు నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సరిగ్గా అందించాలన్నారు. కల్లూరు వార్డులపై వివక్ష.. –గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 14 వార్డులపై వివక్ష చూపుతున్నారు. నగరంలో రెండురోజులకోసారి నీరు వస్తే కల్లూరు 14 వార్డుల్లో వారం, పదిరోజులకు కానీ విడుదల చేయడం లేదు. గత కలెక్టర్.. జిల్లాలో నీటి కరువే లేనట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కరువు పనుల బిల్లులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. యాపర్లపాడు రోడ్డు ఇప్పటి వరకు ఎందుకు మంజూరు కాలేదు? కర్నూలు నగరానికి మంత్రులు వస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకుండా వివక్ష చూపుతున్నారు. పిన్నాపురం, కందికాయ, ఉప్పలపాడు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చండి. ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వండి.. –ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఉపాధి కూలీలకు మూడు నెలలుగా నిలిచిన వేతనాలను వెంటనే ఇవ్వండి. రోజుకు రూ.197 ఇవ్వాల్సి ఉండగా రూ.120 నుంచి రూ.130 మాత్రమే ఇస్తున్నారు. ఎండలు మండుతున్నా సరైన సౌకర్యాలు లేవు. వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారిని పక్కన పెట్టి వారికి అనుకూలమైన వారికి పింఛన్లు వెంటనే మంజూరు చేస్తున్నారు. వంద శాతం వికలత్వం ఉన్నా వికలాంగుల కోటాలో పింఛన్ రావడం లేదు. వయసు ఎక్కువ నమోదు చేయించుకుని పింఛన్లు స్వాహా చేస్తున్న కేసులు అనేకం ఉన్నాయి.


