విజయ డైరీ చైర్మన్‌పై టీడీపీ నేతల ఒత్తిళ్లు | Chalasani Anjaneyulu Appointed As Vijaya Dairy Chairman | Sakshi
Sakshi News home page

విజయ డైరీ చైర్మన్‌పై టీడీపీ నేతల ఒత్తిళ్లు

Aug 6 2026 11:12 PM | Updated on Aug 6 2026 11:12 PM

Chalasani Anjaneyulu Appointed As Vijaya Dairy Chairman

ఆంధ్రప్రదేశ్‌, విజయవాడ: విజయ డెయిరీ చైర్మన్‌గా బుధవారం సాయంత్రం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక అనంతరం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఇద్దరు మంత్రులు, టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రులు విజయ డెయిరీ కార్యాలయానికి వెళ్లి చలసాని ఆంజనేయులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఒత్తిళ్ల కారణంగా చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

అయితే, టీడీపీ నేతలు, మంత్రుల నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన లేదు. అలాగే, చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికావడానికి గల అసలు కారణాలు రాజీనామా చేయాలనే ఒత్తిడేనా అనేదానిపై వైద్యుల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement