
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్‌తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.