ఆంధ్రప్రదేశ్: తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ లారీ మార్గమధ్యంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయిన డ్రైవర్ లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడి లోయలో పడింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రాణం తీసిన రీల్స్ సరదా


