కలిసి పోరాడదాం | AP JAC Amaravati leaders invite AP NGO leaders | Sakshi
Sakshi News home page

కలిసి పోరాడదాం

Aug 26 2026 4:23 AM | Updated on Aug 26 2026 4:23 AM

AP JAC Amaravati leaders invite AP NGO leaders

28న జరిగే రాష్ట్ర సదస్సుకు రండి 

ఏపీ ఎన్జీఓ నేతలకు ఏపీ జేఏసీ అమరావతి నేతల ఆహ్వానం

సాక్షి, అమరావతి/ గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఉద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదా­మని ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఏపీ జేఏసీ నేతలను ఆహ్వానించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో నాయకుల బృందం మంగళవారం విజ­య­వాడలో ఏపీఎన్జీవో భవన్‌కి వెళ్లి ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్య­క్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్‌ ఎ.విద్యా­సాగర్, ప్రధాన కార్యదర్శి రమణను కలిశారు. 

ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యో­గులు, ఉపాధ్యా­యులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమ­స్య­లపై ప్రభు­త్వం రెండేళ్లుగా స్పందించని నేప­థ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నా­మని తెలిపారు. ఈనెల 28న రాష్ట్ర సదస్సు నిర్వ­హిస్తున్నామని అందులో పాల్గొనాలని కోరారు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కానీ కూటమి ప్రభు­త్వం గత నెల 22న చర్చలు జరిపి నెల రోజులు దాటినా ఎటువంటి నిర్ణయాలు ప్రక­టించలేదని తెలిపారు. 

ఇది చాలా బాధాకర­మని అందుకే ఉద్యోగులంతా గతంలో మాదిరి రెండు జేఏసీలు కలిసి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నార­న్నారు. దీనిపై ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యా­సాగర్‌ స్పందిస్తూ తాము వచ్చే నెల 3న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకు­న్నా­మని, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుని విష­య­ం చెబుతా­మన్నారు. అలాగే, బొప్పరాజు వెంకటే­శ్వర్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్య­క్షుడు రామకృష్ణను 28న జరిగే రాష్ట్ర సదస్సుకు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement