నేటి నుంచి అక్కడక్కడా వానలు | Andhra pradesh to experience light to Moderate Rains for Three Days | Sakshi
Sakshi News home page

నేటి నుంచి అక్కడక్కడా వానలు

Jun 24 2024 3:20 AM | Updated on Jun 24 2024 3:21 AM

Andhra pradesh to experience light to Moderate Rains for Three Days

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్‌లోని మరి­కొన్ని ప్రాంతాల్లోకి,  మహారాష్ట్రలోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్‌–ఛత్తీస్‌గడ్‌లోని మరి­కొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భా­గాలు.. జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవే­శించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించనున్నాయి. దేశమంతటా రుతు­పవనాలు విస్తరించేందుకు అనుకూల వాతా­వరణం ఏర్పడింది.

ఈ కారణంగా.. రాష్ట్ర వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా కోస్తా, రాయలసీమల్లో వానలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ప్రభావంతో.. నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటినుంచి  మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశా­లున్నాయని అధికారులు వెల్లడించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement