మధురవాడ: నాయకత్వం అనేది పదవుల ద్వారా కాకుండా సమాజంపై చూపే ప్రభావం ద్వారా నిర్ణయించబడుతుందని విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్ రోషిణి అపరంజి కొరాటి పేర్కొన్నారు. రుషికొండ సమీపంలోని ఐటీ హిల్–1లో శుక్రవారం సీఐఐ–ఐడబ్ల్యూఎన్ నిర్వహించిన ‘లీడింగ్ ఇండియా ః100–భవిష్యత్తు కోసం స్థితిస్థాపక వ్యవస్థలు’ సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047 నాటికి స్వాతంత్య్ర శతాబ్ది లక్ష్యాల సాధనకు సుస్థిరమైన వ్యవస్థల నిర్మాణం అవసరమన్నారు. సీఐఐ–ఐడబ్ల్యూఎన్ ఏపీ చైర్‌పర్సన్ డాక్టర్ ఉషా పంతుల మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా పనిచేసే సంస్థలే దేశాభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు. మహిళల నాయకత్వంలో సంస్థలు మరింత సమర్థంగా, వినూత్నంగా ఎదుగుతాయని సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో శివప్రియ బాలగోపాలన్, డాక్టర్ రమాదేవి గౌరినేని, తన్మయ, అల్పనా కుమారి, డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, స్ఫూర్తి దాసరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐఐ–ఐడబ్ల్యూఎన్ దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్ శివప్రియ బాలగోపాలన్, ఏపీ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ రమాదేవి గౌరినేని, పూర్వ చైర్‌వుమెన్ తన్మయ, డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, స్ఫూర్తి దాసరి తదితరులు పాల్గొన్నారు.


