మహారాణిపేట: డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలన్నారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అధికారంలోకి రావడానికి అమలుకాని హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని, ఉద్యోగం వచ్చేవరకు ఆ భృతి కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కుంభ రవి, పార్టీ నాయుకులు కట్టుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, కటారి అనిల్ కుమార్ రాజు , బొల్లవరపు జాన్ వెస్లీ, అల్లు శంకరరావు, బర్కత్ అలీ , సాడి పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ , పేర్ల విజయ చందర్, జీలకర్ర నాగేంద్ర, సేనాపతి అప్పారావు, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, అంబటి శైలేష్, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకష్ణ, మనోజ్ కుమార్ గొడబ, దిలీప్ కుమార్, సాయి, ఎండి షరీఫ్, కర్రిరామి రెడ్డి, ఉమ్మడి కళ్యాణ్, బొడ్డేటి కిరణ్, గోడేసి శ్రీనివాస్ రెడ్డి (బుజ్జి), జగుపల్లి నరేష్, విక్టర్, విశాలక్ష్మి, సత్యాల, కాగితాల రవి కిరణ్, తాడి రవి తేజ, రౌత్ శ్రీను, సతీష్, పిలక మధు, శ్రవణ్, ప్రవీణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


