విడాకులకు 6 నెలల కూలింగ్‌ పీరియడ్‌ తప్పనిసరి కాదు | 6 month cooling period not mandatory for divorce | Sakshi
Sakshi News home page

విడాకులకు 6 నెలల కూలింగ్‌ పీరియడ్‌ తప్పనిసరి కాదు

Jun 26 2026 4:14 AM | Updated on Jun 26 2026 4:14 AM

6 month cooling period not mandatory for divorce

సాక్షి, అమరావతి: పరస్పర అంగీకారంతో భార్య భర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల పాటు వేచి ఉండటం (కూలింగ్‌ పీరియడ్‌) తప్పనిసరి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలు­వరించారు. 

ఇందుకు సంబంధించి ఒంగోలు ఫ్యామి­లీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హై­కోర్టు.. భార్య, భర్తలు చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటూ, తమ మధ్య ఉన్న వివాదాలన్నింటినీ పరిష్క­రించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి­నప్పుడు విధించే కూలింగ్‌ పీరియడ్‌ వల్ల వారికి మానసిక వేదన పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టంచేసింది. 

ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ  భార్య, భర్తలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ మేరకు అనుమతించిన హైకోర్టు వీలైనంత త్వరగా విడాకుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement