కొలువును త్యజించి.. ప్రజా సేవ తలంచి | - | Sakshi
Sakshi News home page

కొలువును త్యజించి.. ప్రజా సేవ తలంచి

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

● సర్కారీ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి..

● రాప్తాడు జెడ్పీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థినిగా ఆగ్రహారం కావ్య

రాప్తాడు రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగం.. భద్రమైన భవిష్యత్తుఅయినా ఆమె మనసు మాత్రం ప్రజాజీవితం వైపు మళ్లింది. ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆగ్రహారం కావ్య. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాప్తాడు జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచారు. ఉన్నత విద్య, ఉద్యోగ అనుభవం ఉన్న ఆమె రాజకీయ ప్రస్థానం ఇప్పుడు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఉద్యోగాన్ని వీడి.. రాజకీయాల వైపు

రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చుక్క సంజీవరాయుడు కోడలు ఆగ్రహారం కావ్య బీటెక్‌ పూర్తి చేశారు. సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. అయితే రాజకీయాలపై ఉన్న ఆసక్తి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రజాప్రతినిధిగా సేవలందించాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వచ్చింది. రాప్తాడు మండల అభివృద్ధికి తనవంతు కృషి, మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని కావ్య తెలియజేశారు. రాప్తాడు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆగ్రహారం కావ్య శుక్రవారం అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలను కలుపుకుని, అందరి మద్దతుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement