బెళుగుప్ప: నరసాపురం ఎంపీటీసీ స్థానానికి యలగలవంక గ్రామానికి చెందిన బోయ రాధమ్మ వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేసేందుకు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న నరసాపురం టీడీపీ నాయకులు ఆర్.కె.వెంకటేశులు, ఎర్రగుడి నాయకులు లక్ష్మినారాయణ, మురళి తదితరులు రాధమ్మ చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. అభ్యర్థిపై దౌర్జన్యం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల చించివేత ఘటనపై ఎస్‌ఐ శివ స్పందించారు. మరోసెట్ పత్రాలను తెప్పించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాధమ్మతో నామినేషన్ వేయించారు.


