రశీదు ఇచ్చి.. నామినేషన్‌ తిరస్కరించి.. | - | Sakshi
Sakshi News home page

రశీదు ఇచ్చి.. నామినేషన్‌ తిరస్కరించి..

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

● రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం ఎర్రగుంట–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున మంజుల రెండు సెట్లు, సునీతమ్మ ఒక సెట్టు చొప్పున మొత్తం మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అయితే, దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో పోటీ చేసే స్థానం ఎదుట ‘ఎర్రగుంట–1’ అని ఉండాల్సింది పోయి కేవలం ‘ఎర్రగుంట’ అని మాత్రమే రాసి ఉందనే సాకుతో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిమిషమే అధికారులు సదరు ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తూ, ఆర్డీవో అప్పీలుకు వెళ్లాలని సూచించారు. తామన్నీ సక్రమంగా దరఖాస్తులో పొందుపరిచి సమర్పించామని, అధికారులు కూడా ఎర్రగుంట–1 స్థానానికి రశీదు ఇచ్చి డిపాజిట్‌ కూడా కట్టించుకున్నారని, ఇప్పుడే వివరాలు మార్చేసి రభస చేసి.. నామినేషన్‌ను తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement