స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం ‘కూటమి’ కుటిల రాజకీయం చేస్తోంది. అధికారుల అండతో పేట్రేగి పోతోంది. ఏదో ఒక కారణంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా హుకుం జారీ చేసింది. అధికార పార్టీ ఆదేశాలను పాటించడం అధికారుల వంతైంది. శనివారం న | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం ‘కూటమి’ కుటిల రాజకీయం చేస్తోంది. అధికారుల అండతో పేట్రేగి పోతోంది. ఏదో ఒక కారణంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేలా హుకుం జారీ చేసింది. అధికార పార్టీ ఆదేశాలను పాటించడం అధికారుల వంతైంది. శనివారం న

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

శింగనమల మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు 74 నామినేషన్లు రాగా.. రెండింటిని తిరస్కరించారు. సలకంచెర్వు ఎంసీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ నుంచి నామినేషన్‌ వేసిన అలివేలమ్మ, అంజినమ్మలకు చెవుడు ఉండడంతో పోటీ చేయడానికీ అనర్హులని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ తరఫున అడ్వొకేట్‌ రమణారెడ్డి వాదించారు. చట్టంలో చెవుడు, మూగ రెండూ ఉన్న వారే అనర్హులని, ఒకటి మాత్రమే ఉన్నప్పుడు ఎలా రిజెక్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఒత్తిడి చేయడంతో ఆర్‌ఓ లలితమ్మ నామినేషన్‌ పత్రాలను తిరస్కరణ చేసి, అనంతపురం ఆర్డీఓకు రెఫర్‌ చేశారు.

స్క్రూటినీలో ‘పచ్చ’ నేతల హల్‌చల్‌

ఆత్మకూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి 61 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఇనుప ముళ్ల కంచెల నడుమ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. అయితే టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నామినేషన్లు తిరస్కరించాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తూ హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సంబంధించి బి.యాలేరు నుంచి రెండు, వేపచెర్ల, ముట్టాల, సింగంపల్లి నుంచి ఒక్కొక్కటి మొత్తం ఐదు నామినేషన్లను తిరస్కరిస్తూ.. ఆర్డీఓ కోర్టుకు అప్పీలు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో కక్షకట్టి తిరస్కరించేలా చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు.

● రాప్తాడు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన ముఖ్య అభ్యర్థులతో సహా మొత్తం ముగ్గురు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని తిరస్కరించారంటే...

● శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం బొందలవాడ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణను ప్రతిపాదించిన వ్యక్తిని పరిశీలనకు రాకుండా చేసి, ఫారంలో ఉన్న సంతకం తనది కాదని ఆ వ్యక్తితో చెప్పించిన వీడియోను అధికారులు పరిగణనలోకి తీసుకుని నామినేషన్‌ను తిరస్కరించారు. నార్పల – 1 అభ్యర్థి ఆదినారాయణమ్మ పంచాయతీకి అద్దె బకాయి చెల్లించలేదన్న సాకుతో నామినేషన్‌ను రిజెక్ట్‌ చేశారు. అదే సమయంలో నార్పల–4 ఎంపీటీసీ జనసేన అభ్యర్థి రాయదుర్గం తేజలక్ష్మి పన్ను బకాయి ఉండటంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా అధికారులు ఆమె నామినేషన్‌ను ఆమోదించడం ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా నిలిచింది.

● బుక్కరాయసముద్రం – 4 ఎంపీటీసీ అభ్యర్థి కొండయ్యకు సంబంధించి ఓటర్‌ లిస్టులోని సీరియల్‌ నంబర్‌, నామినేషన్‌ దరఖాస్తు ఫారంలో పొందుపరిచిన సీరియల్‌ నంబర్‌ సరిపోలలేదనే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌లో సంతకాలు చేయలేదని దండువారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి నాగరాజు, చెన్నంపల్లి అభ్యర్థులు సుబ్బలక్ష్మి, నల్లాని కుమారి, వెంకటాపురం అభ్యర్థి లక్ష్మీదేవి నామినేషన్లను రిజెక్ట్‌ చేశారు. కొర్రపాడు–2 ఎంపీటీసీ అభ్యర్థి కుళ్లాయమ్మ దరఖాస్తు ఫారంలో సంతకం చేయలేదని నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.

● తాడిపత్రి మండలంలో బ్రాహ్మణపల్లి, వంగనూరు, బోడాయిపల్లి, ఎర్రగుంటపల్లి, గన్నెవారిపల్లి–2, గన్నెవారిపల్లి–3 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. నామినేషన్‌ పత్రాల్లో కొన్నింటిని గల్లంతు చేసి... పత్రాలు పొందుపరచలేదనే నెపంతో రిజెక్ట్‌ చేశారు. పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కలూరు, జూటూరు, చిన్న ఎక్కలూరు, నరసాపురం ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్‌ పత్రాలను సరిగా నింపలేదనే సాకుతో అధికారులు తిరస్కరించారు.

● ఉరవకొండ మండలంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ స్వగ్రామమైన పెద్దకౌకుంట్లలో రెండు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, టీడీపీ నేతలు వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసి, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. విడపనకల్లు మండలంలోని వి.కొత్తకోట, హావళిగి–1 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు సరైన ప్రతాలను పొందుపరచలేదనే సాకుతో అధికారులు నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా నామినేషన్ల పరిశీలనకు సంబంధించిన వివరాలను సాయంత్రం ఏడుగంటలైనా తెలపకుండా ఆర్‌ఓ వెళ్లిపోవడంతో ఇరు పార్టీల అభ్యర్థులు కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నామినేషన్ల తిరస్కరణకు అధికారులపై ఒత్తిడి

టీడీపీ నాయకులు అభ్యంతరం తెలపడమే తడవుగా రిజెక్ట్‌..

దాఖలు సమయంలో అన్నీ ఉన్నా.. పరిశీలనలో పత్రాల గల్లంతు

వైఎస్సార్‌సీపీ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలపైనే గురి

ఎన్నికలు జరగకుండానే సింహభాగం స్థానాల కై వసానికి కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement