రాజకీయంగా ఎదుర్కోలేకే తిరస్కరణలు | - | Sakshi
Sakshi News home page

రాజకీయంగా ఎదుర్కోలేకే తిరస్కరణలు

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

● పెనకచెర్ల, ముంటిమడుగు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు పునఃపరిశీలించాలి

● మాజీ మంత్రి శైలజానాథ్‌ డిమాండ్‌

గార్లదిన్నె:రాజకీయంగా ఎదుర్కోలేకే కూటమి నేతలు కుట్రపన్ని అధికారుల చేత వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరింపజేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లదిన్నె ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బ్యాళ్ల భీమన్న, బీరప్ప నామినేషన్‌ పత్రాల్లో ఆస్తులకు సంబంధించిన పేపర్‌ ఒకటి లేదని ఆర్‌ఓ మంజుల తిరస్కరించారు. ముంటిమడుగు ఎంపీటీసీ అభ్యర్థులు సునీత, నాగలక్ష్మి నామినేషన్లు కూడా రిజెక్ట్‌ చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఆర్‌ఓ ఏకపక్షంగా వ్యవహరించారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. లోనికెళ్లి అధికారులతో మాట్లాడుతామని ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడకు వచ్చిన ఆర్‌ఓతో మాజీ మంత్రి శైలజానాథ్‌ మాట్లాడారు. నామినేషన్‌ సమ ర్పించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించి సంతకం కూడా చేసి.. ఇప్పుడు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. తిరస్కరించిన నామినేషన్లను పునఃపరిశీలన చేసి.. ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి, బచ్చలన్న, బూత్‌ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఓబిరెడ్డి, మండల బూత్‌ కమిటీ అధ్యక్షులు సుంకిరెడ్డి, హేమసుందర్‌, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్టీఐ విభాగం నియోజవర్గ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ల పరిశీలనఅంతా గోప్యమే

బుక్కరాయసముద్రం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా బుక్కరాయసముద్రంలో శనివారం నామినేషన్ల పరిశీలనను అధికారులు గోప్యంగా చేశారని మాజీ మంత్రి శైలజానాథ్‌ మండిపడ్డారు. నామినేషన్ల పరిశీలనలో హెల్ప్‌ డెస్క్‌ అని పేరుకు మాత్రమే పెట్టారని, వాటిలో ఎక్కడా నామినేషన్లను సరిగా పరిశీలించలేదని పలువురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తన దృష్టికి తేవడంపై శైలజానాథ్‌ స్పందించారు. అధికార పార్టీ నాయకులను నామినేషన్‌ కేంద్రంలోకి ఎందుకు అనుమతించారని ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. స్క్రూట్నీ సమాచారం బయటకు ఎందుకు తెలపడం లేదన్నారు. నామినేషన్ల పరిశీలన, అధికారుల నిర్లక్ష్య ధోరణిపై జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని శైలజానాథ్‌ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యల్లనూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం

అనంతపురం : శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థినిని పోలీస్‌ స్టేషన్‌ వద్దే ఉంచి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆనంద్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. వీటిపై విచారణ జరిపి.. అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

నిబంధనలన్నీ వైఎస్సార్‌సీపీ వారికేనా?

అనంతపురం న్యూటౌన్‌: నిబంధనలన్నీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విషయంలోనే వెలుగుచూస్తున్నాయని ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సాకే సాకే శైలజనాథ్‌ ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి నార్పల జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణపై శనివారం రాత్రి స్థానిక రిటర్నింగ్‌ అధికారి విజయలక్ష్మిని శైలజానాథ్‌ కలిసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement