‘అనంత’ ఆత్మగౌరవానికి మధ్య పోటీ | - | Sakshi
Sakshi News home page

‘అనంత’ ఆత్మగౌరవానికి మధ్య పోటీ

Oct 25 2026 6:40 AM | Updated on Oct 25 2026 6:40 AM

ఢిల్లీ అహంకారానికి..

అనంతపురం: నగర పాలక సంస్థ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి.. అనంతపురం ఆత్మగౌరవానికి మధ్యే పోటీ అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌ అభివర్ణించారు. శనివారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మేయర్‌ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో కలిసి వైఎస్సార్‌సీపీ – మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్‌, రమేష్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీని రంగంలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ సవరణ చట్టం వంటి నిర్ణయాలతో ముస్లిం మైనారిటీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మేయర్‌ స్థానం కేటాయించడంపై టీడీపీ ముస్లిం నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. నగరంలో కూటమి ఎమ్మెల్యే అనుచరుల దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపిస్తే సేవకులుగా ఉంటారని స్పష్టం చేశారు. 2019–2024 మధ్య వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.1200 కోట్లతో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు హరీష్‌ యాదవ్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. ఎన్నికల్లో కూటమి నేతలు డబ్బు, అధికార మదంతో దౌర్జన్యాలు చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ఏకమై కూటమి అభ్యర్థులను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు నదీమ్‌ అహ్మద్‌, మాజీ మేయర్‌ వసీం మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సాకుతో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా 21వ డివిజన్‌కు సంబంధించిన టీడీపీ నాయకులు గఫ్ఫార్‌, షఫీ వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, వేముల నదీం అహమ్మద్‌, ఏకే ఫయాజ్‌ఖాన్‌, 21వ డివిజన్‌ అభ్యర్థి ఖాజాపీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement