అర్ధంతరంగా ఆరిన ఆశల దీపం | - | Sakshi
Sakshi News home page

అర్ధంతరంగా ఆరిన ఆశల దీపం

Oct 18 2026 2:12 AM | Updated on Oct 18 2026 2:12 AM

● ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

నార్పల : ఒక్కగానొక్క కుమార్తె అని ఆ తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుతున్నారు.. ఉన్నతంగా చదివిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఆశించారు..అందుకు తగ్గట్టు ఆమె బాగోగులు చూసుకుంటున్నారు.. పులివెందులలో చదువుతున్న ఆమె.. దసరా సెలవులకు వస్తూ ఆలస్యంగా ఇంటికి చేరుకుందన్న కారణంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన విద్యార్థిని..క్షణికావేశంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాల్సిన వయసులో..ఉన్నపళంగా ప్రాణాలు తీసుకొని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది..ఈ విషాదకర ఘటన నార్పలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని మసీదు కట్టవీధికి చెందిన నీలూరి నాగరాజు, నాగేశ్వరి దంపతులకు తేజస్విని (16) సంతానం. నాగరాజు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుమార్తెను ఉన్నతంగా చదివించాలనుకున్నారు. ఆమె పులివెందులలోని లయోల కళాశాలలో డిప్ల్లొమో మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు సొంతూరుకు వచ్చిన సమయంలో రెండుగంటలు ఆలస్యంగా వచ్చిందని తల్లి మందలించింది. మనస్తాపం చెందిన తేజస్విని.. తల్లి దుస్తులు ఆరేసేందుకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా.. అప్పటికే కూతురు ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. చేతికి ఎదిగి వచ్చిన కుమార్తె మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తేజస్విని (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement