అనంతపురం: ఆర్డీటీ క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్న కర్నల్ సీకే నాయుడు ట్రోఫీ (అండర్–23) ఎలైట్ గ్రూప్ మల్టీ–డే మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు అద్భుత ప్రతిభ కనబర్చారు. మ్యాచ్ డ్రాగా ముగిసినా ఆంధ్ర ఆటగాళ్ల ప్రదర్శన క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగులు చేసి జార్ఖండ్ ఆధిపత్యం సాధించినా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు సాధించిన ఆంధ్ర బ్యాటర్లు సంయమనం ప్రదర్శించి మ్యాచ్ డ్రాగా ముగించారు. గరిమెల్ల తేజ (78) అర్ధశతకంతో జట్టును ఆదుకోగా, హనీష్ రెడ్డి (36), మున్నంగి అభినవ్ (35), వరుణ్ సాత్విక్ (33), నాటౌట్ బ్యాటర్ బత్తిన యశ్వంత్ (25) పరుగులు జోడించారు. జీఎస్‌పీ తేజ ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ , ’బెస్ట్ బ్యాటర్’ అవార్డును కై వసం చేసుకున్నారు. బౌలింగ్‌లో అదరగొట్టిన ఎం.దీపక్ ఉత్తమ బౌలర్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా జార్ఖండ్ జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్ర జట్టుకు 1 పాయింట్ దక్కింది. ఈ టోర్నమెంట్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించడంపై క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో అనంతపురం వేదికగా మరిన్ని స్టేట్ లెవెల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్ర హెడ్ కోచ్ నిర్మల్ కుమార్, జార్ఖండ్ హెడ్ కోచ్ ఇషాన్ జగ్గీ, మ్యాచ్ రెఫ్రీ సిద్ధిఖీ మాట్లాడుతూ అనంతపురంలో మైదా నం, వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని, మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగిందన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
అనంతపురం: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాల యం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల్లో ఎస్సీ విభాగం జిల్లా సెక్రటరీలుగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన హరిజన ధనుంజయ, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శిగా గుంతకల్లు నియోజకవర్గం నుంచి రమావత్ రమేష్ నాయక్, జిల్లా రైతు విభాగం కార్యదర్శిగా ఎం.రామిరెడ్డి (రాయదుర్గం), జిల్లా మైనార్టీ విభాగం సెక్రటరీలుగా షేక్ షబ్బీర్ (తాడిపత్రి), టీకే ఫయాజుద్దీన్ (తాడిపత్రి), జిల్లా యువజన విభాగం కార్యదర్శులుగా పందిర్లపల్లి సూర్య తేజారెడ్డి (తాడిపత్రి), వి.మేఘనాథరెడ్డి (తాడిపత్రి), జిల్లా ఐటీ విభాగం సెక్రటరీగా పి.చెన్నకృష్ణారెడ్డి (తాడిపత్రి), జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శిగా పి.హనుమంతకుమార్ రెడ్డి (తాడిపత్రి), అనంతపురం నగర బీసీ విభాగం జనరల్ సెక్రటరీగా ఎంపీ శివశంకర్ (అనంతపురం అర్బన్)కు చోటు కల్పించారు.
ఇంటెలెక్చువల్ ఫోరంలో
పలువురికి చోటు..
పార్టీ ఇంటెలెక్చువల్ ఫోరంలో పలువురికి స్థానం కల్పించారు. శింగనమల నియోజకవర్గానికి చెందిన సి. మనోహర్‌రెడ్డిని గార్లదిన్నె మండల ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా, ఎస్. నారాయణరెడ్డిని శింగనమల మండల ఫోరం అధ్యక్షుడిగా, కె.సత్యనారాయణను బుక్కరాయసముద్రం మండలం ఫోరం అధ్యక్షుడిగా, నార్పల మండల ఫోరం అధ్యక్షుడిగా ఎం.జనార్దన, పుట్లూరు మండల ఫోరం అధ్యక్షుడిగా ఈ.వెంకటసుబ్బారెడ్డి, యల్లనూరు మండల ఫోరం అధ్యక్షుడిగా పి.యోగానందారెడ్డికి చోటు కల్పించారు. రాయదుర్గం మండల రైతు విభాగం కార్యదర్శులుగా కె.చంద్రశేఖరరెడ్డి, బి.గురునాథరెడ్డికి స్థానం దక్కింది.


