
సంతానం కలుగలేదని వివాహిత ఆత్మహత్య
బొమ్మనహాళ్: కర్ణాటకలోని కుడితిని ఠాణా పరిధిలో తిమ్మలాపురం వద్ద హెచ్చెల్సీలో గల్లంతైన ఓ యువకుడు శుక్రవారం ఉదయం బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ వద్ద మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన పవన్ (22) దుస్తుల వ్యాపారంతో పాటు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. ఈ క్రమంలో లారీ లోడు తీసుకుని కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కుడితిని ప్రాంతానికి వచ్చాడు. ఈ నెల 19న తిమ్మలాపురం సమీపంలో హెచ్చెల్సీలో ఈత కొట్టేందుకు నీటిలో దిగిన పవన్.. ప్రవాహ వేగానికి గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం దేవగిరి క్రాస్ వద్ద డిస్టిబ్యూటరీ కాలువలో ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, వెలికి తీశారు. హెచ్చెల్సీ ఎగువ ప్రాంతాల్లోని పీఎస్‌లకు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుడితిని పోలీసులు స్పందించి అందజేసిన వివరాలు సరిపోవడంతో మృతుడిని పవన్‌గా నిర్ధారించారు. మృతుడి తండ్రి పెద్దరాజు ఫిర్యాదు మేరకు కుడితిని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సంతానం కలుగలేదని వివాహిత ఆత్మహత్య
గుమ్మఘట్ట: మండలంలోని 75వీరాపురం గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి (35) ఆత్మ హత్య చేసుకుంది. గ్రామానికి చెందిన లింగప్పకు నేత్రపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో 17 సంవత్సరాల క్రితం వివాహ మైంది. వీరికి సంతానం లేదు. పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారి సాయంతో రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ తిరస్కారం... యువకుడి బలవన్మరణం
కూడేరు: తన ప్రేమను యువతి నిరాకరించడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన నారాయణ కుమారుడు అనిల్‌కుమార్ (28) కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె అంగీకరించకపోవడంతో క్షణికావేశానికి లోనైన అనిల్‌కుమార్.. సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేసి శుక్రవారం కూడేరు మండలం గొటుకూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సీఐ రాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.