
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లిన ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.
అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.
కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు.
