
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేతల వేధింపులకు గర్భిణి బలైంది. ఉరేసుకుని గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది. శ్రావణి భర్త శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. భర్త వేధిస్తున్నాడంటూ శ్రావణి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోకుండా పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోవడంతో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తన చావుకు కారణం టీడీపీ ప్రభుత్వం, పోలీసులే అంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో బాధితురాలి చివరి ఆడియో వైరల్‌గా మారింది. భర్త శ్రీనివాస్‌తో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ శర్మాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం పోలీసులు, టీడీపీ నేతలపై విచారణ జరపనున్నారు.
