తిరుపతి: జిల్లాలోని చందరగిరి మండలం కొత్తశానంబట్లలో ఏర్పాటు చేసిన జల్లికట్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎద్దులు ఒక్కసారిగా అక్కడున్న వారిపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్పల్ప గాయాలయ్యాయి. ఆ ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జల్లికట్టు పోటీలో పాల్గొన్న ఎద్దు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది ఈ పోటీలకు అధికారిక అనుమతి ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. జల్లికట్టు ప్రధానంగా తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ పోటీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా పశువుల పండుగ పేరుతో జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. తిరుపతి ఘటనలో కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


