
రచ్చకట్ట కోసం రచ్చరచ్చ
● రెండు వర్గాలుగా విడిపోయి పీఎస్
ఎదుటనే తలపడిన టీడీపీ నేతలు
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని దేవాదులకొండ గ్రామంలో రచ్చకట్ట వివాదం తారస్థాయికి చేరుకుంది. గ్రామ నడిబొడ్డున పూర్వీకులు ఏర్పాటు చేసిన రచ్చకట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు ఏకమై పునరుద్ధరణ పనులు చేపట్టారు. టీడీపీలోని ఓ వర్గం వారు చేపట్టిన ఈ పనులను అదే పార్తీకి చెందిన మరో వర్గం అడ్డుకుంది. దీంతో వివాదం ముదిరి ఆదివారం పోలీసుస్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు అందజేశారు. ఆ సమయంలో ఇరువర్గాల టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పీఎస్ ఎదుటనే తలపడిన టీడీపీ నేతలను సముదాయించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. వివాదానికి పరిష్కారం చూపలేక చివరకు గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, సమస్యకు పరిష్కారం చూపుతామని సర్దిచెప్పి పంపారు.
డీఎస్సీ ఫలితాల్లో
మూడు పోస్టులకు అర్హత
కళ్యాణదుర్గం రూరల్: ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కంబదూరుకు చెందిన ముత్యాలప్ప కుమార్తె సాయిచందన ఏకంగా మూడు పోస్టులకు అర్హత సాధించారు. టీజీటీ బయాలజీ జోన్–4లో 81.79 మార్కులతో 5వ ర్యాంక్, జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 83.13 మార్కులతో 8వ ర్యాంక్, ఎస్జీటీలో 84.54 మార్కులతో 84వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా సాయిచందనను పలువురు అభినందించారు.
రైతు కూలీ బిడ్డకు
డీఎస్సీలో ఐదో ర్యాంకు
బత్తలపల్లి: మండల కేంద్రంలో నివాసముంటున్న బాలగొండ ఈరనారప్ప డీఎస్సీ ఫలితాల్లో ఐదో ర్యాంక్ సాధించాడు. ఈరనారప్ప తల్లిదండ్రులు నారాయణస్వామి, నారమ్మ దంపతులు సాధారణ రైతు కూలీలు. వీరిది రాప్తాడు మండలం బండమీదపల్లి స్వగ్రామం. 15 సంవత్సరాల క్రితం బత్తలపల్లికి వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విభాగంలో జిల్లా స్థాయిలో ఐదో ర్యాంక్‌తో పాటు టీజీటీలో 114వ ర్యాంకు, పీజీటీ విభాగంలో 94వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటిన ఈరనారప్పను పలువురు అభినందించారు.

రచ్చకట్ట కోసం రచ్చరచ్చ