
యూరియా పంపిణీపై విజిలెన్స్ ఆరా
బొమ్మనహాళ్: యూరియా దాచి పెట్టినా... బ్లాక్ మార్కెట్‌కు తరలించినా చర్యలు తప్పవని రైతు సేవా కేంద్రం సిబ్బందిని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. యూరియా కొరతపై ‘యూరియా.. ఏదయ్యా’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఉన్నతాధికారులు విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించారు. దీంతో సోమవారం బొమ్మనహాళ్‌లోని రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ ప్రక్రియ, రికార్డులను విజిలెన్స్ సీఐ జమాల్‌బాషా, సిబ్బంది పరిశీలించారు. ఉంతకల్లు క్రాస్, శ్రీధరఘట్ట, ఉద్దేహాళ్ గ్రామాల్లో ఎరువుల దుకాణాలనూ తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన యూరియా సరైన సమయంలో, సరైన ధరకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం: సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం సజావుగా సాగింది. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియకు మొత్తం 488 మంది అభ్యర్థులకు గాను 470 మంది హాజరయ్యారు. సివిల్ కేటగిరిలో 266 మంది, ఏపీఎస్పీ కేటగిరిలో 244 మంది అభ్యర్థులు ఉన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి, ఏఓ రవిరాంనాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ స్కూళ్ల డీఐగా దావూద్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉర్దూ స్కూళ్ల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (డీఐ)గా పి.దావూద్ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నార్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దావూద్‌కు ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ నియమించారు.

యూరియా పంపిణీపై విజిలెన్స్ ఆరా

యూరియా పంపిణీపై విజిలెన్స్ ఆరా