
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు
అనంతపురం: ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా బాలికల జట్టును సోమవారం ఆర్డీటీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ మేరకు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు బి.గాయత్రి, కార్యదర్శి బి.గంగమ్మ తెలిపారు. ఎంపికై న వారిలో టి.లక్ష్మి, సురేఖ, మౌనిక, ధరణి, నాగప్రసన్న, లక్ష్మి యాదవ, టి.లావణ్య, పల్లవి, మూర్చిత, రాధిక, కేవీ ధరణి, బసంతి, కస్తూరి, శ్రావణి, ఎస్.జాహ్నవి, సుప్రియ, రిస్మిత ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులను సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ సి.వెంకటేశులు అభినందించారు.