
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap. gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియ జేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నేడు జిల్లా సమీక్ష సమావేశం
అనంతపురం అర్బన్: జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం సోమవారం జరగ నుంది. జిల్లా ఇన్‌చార్జ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధ్యక్షతన మధ్యాహ్నం 2.45 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించనున్నారు. డీఆర్‌సీ సమావేశానికి సమగ్ర వివరాలు, సమాచారంతో హాజరు కావాలని అన్ని శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే నెలలో
సీఎం జిల్లా పర్యటన
అనంతపురం ఎడ్యుకేషన్/గార్లదిన్నె: ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ మొదటివారంలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ఆదివారం అనంతపురం రూరల్, గార్లదిన్నె మండలాల్లో స్థలాలను పరిశీలించారు. అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు వద్ద (అనంతపురం – కదిరి జాతీయ రహదారి పక్కన), అనంతపురం– బెంగళూరు జాతీయ రహదారి పక్కన రాప్తాడు మండలంలోని ఎంఐజీ లేఔట్ వద్ద స్థలాలను పరిశీలించారు. అనంతరం గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) వద్ద స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు వీలుగా అనంతపురం నగరానికి దగ్గరలో మరికొన్ని చోట్ల స్థలాల్ని పరిశీలించాలని ఆర్డీఓ, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లే కుండా, వీఆర్‌ఓలు, విలేజ్ సర్వేయర్లను పిలి పించి సంబంధిత స్థలాల స్కెచ్‌లను సిద్ధం చేసి నివేదించాలని సూచించారు. వారివెంట అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్పీ వెంకటేశులు, అనంతపురం, అనంతపురం రూరల్, గార్లదిన్నె మండలాల తహసీల్దార్ల్లు హరికుమార్, మోహన్ కుమార్,ఈరమ్మ, ఇటుకలపల్లి పీఎస్ ఎస్‌ఐ విజయ్ కుమార్ ఉన్నారు.

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’